Loading...
Elon Musk: ఏఐ కోసం లక్షల కోట్ల పెట్టుబడులు.. కంపెనీలకు మస్క్ హెచ్చరిక
ఏఐ కోసం లక్షల కోట్ల పెట్టుబడులు.. కంపెనీలకు మస్క్ హెచ్చరిక

Elon Musk: ఏఐ కోసం లక్షల కోట్ల పెట్టుబడులు.. కంపెనీలకు మస్క్ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రస్తుతం నెలకొన్న పోటీ భవిష్యత్తులో టెక్ కంపెనీలకు భారీ ఆర్థిక భారంగా మారే అవకాశం ఉందని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ హెచ్చరించారు. అత్యాధునిక ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడానికి అవసరమైన కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో కంపెనీలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి ఈ పరిస్థితి మరింత తీవ్రమై, టెక్ సంస్థలు ఊహించని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఏఐ పరిశోధకుడు ఫ్రాంకోయిస్ చోలెట్ ఎక్స్‌ (X) వేదికగా చేసిన ఓ పోస్టుకు స్పందిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

డేటా సెంటర్లు, చిప్‌ల కోసం దిగ్గజాల భారీ ఖర్చులు

భారీ స్థాయిలో కంప్యూటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం అంత సులభమైన విషయం కాదని మస్క్ పేర్కొన్నారు.

వాటిని నిరంతరం పనిచేయించేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా,శీతలీకరణ (కూలింగ్) సదుపాయాలను కల్పించడం కూడా పెద్ద సవాలేనని వివరించారు.

ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి ప్రముఖ టెక్ కంపెనీలు ఏఐ అభివృద్ధిలో పోటీపడుతున్నాయి.

ఇందుకోసం భారీ డేటా సెంటర్ల నిర్మాణంతో పాటు ఎన్విడియా జీపీయూ చిప్‌ల కొనుగోలుపై బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి.

మరోవైపు, 2029 వరకు హై బ్యాండ్‌విడ్త్ మెమరీ (HBM), డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ (DRAM) చిప్‌ల ఉత్పత్తి సామర్థ్యం ఇప్పటికే ముందుగానే బుక్ అయిపోయిందని ఫ్రాంకోయిస్ చోలెట్ వెల్లడించారు.

ఏఐ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌కు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.

వివరాలు 

భారీ పెట్టుబడులే ఆర్థిక భారంగా మారే ప్రమాదం

అయితే, ఏఐ మౌలిక సదుపాయాల కోసం కంపెనీలు పెడుతున్న భారీ పెట్టుబడుల వెనుక ఉన్న ఆర్థిక ప్రమాదాన్ని మస్క్ ప్రధానంగా ప్రస్తావించారు.

డేటా సెంటర్ల నిర్మాణం, అవసరమైన చిప్‌ల కొనుగోలు వంటి పనులకు ముందుగానే పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు.

కానీ, ఈ పెట్టుబడుల ద్వారా ఆదాయం రావడానికి కొంత సమయం పడుతుందని వివరించారు.

ఈ మధ్యలో నిర్మాణ పనుల్లోనూ, ఇతర సాంకేతిక ఏర్పాట్లలోనూ ఎక్కడైనా ఆలస్యం జరిగితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని హెచ్చరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీల రోజువారీ కార్యకలాపాలు,పెట్టుబడుల అవసరాల కోసం అవసరమయ్యే వర్కింగ్ క్యాపిటల్‌ను సమకూర్చుకోవడానికే అదనంగా వందల బిలియన్ల డాలర్లు అవసరమయ్యే అవకాశం ఉందని మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

ఏఐ పెట్టుబడులతో పెరగనున్న ఆర్థిక భారం.. మస్క్ ఆందోళన  

ఇంత భారీ మొత్తంలో నిధులను కంపెనీలు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటాయన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు.

ఏఐ రంగంలో ఆధిపత్యం సాధించాలనే లక్ష్యంతో ప్రపంచ టెక్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.

అయితే, ఈ ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం వెంటనే రాకపోతే కంపెనీలపై అప్పుల భారం పెరిగే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా డేటా సెంటర్లు, కంప్యూటింగ్ చిప్‌లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడి మరింత పెరగవచ్చన్నది మస్క్ హెచ్చరిక సారాంశం.

ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టెక్ ప్రపంచంలో చర్చకు దారితీశాయి.

ADVERTISEMENT