Page Loader
Elon Musk: 12వ బిడ్డకు తండ్రి అయ్యిన ఎలాన్ మస్క్ .. పిల్లల తల్లి న్యూరాలింక్ డైరెక్టర్
12వ బిడ్డకు తండ్రి అయ్యిన ఎలాన్ మస్క్ .. పిల్లల తల్లి న్యూరాలింక్ డైరెక్టర్

Elon Musk: 12వ బిడ్డకు తండ్రి అయ్యిన ఎలాన్ మస్క్ .. పిల్లల తల్లి న్యూరాలింక్ డైరెక్టర్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2024
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాన్ మస్క్ 12వ బిడ్డకు తండ్రి అయ్యాడు. న్యూరాలింక్ డైరెక్టర్ షివోన్ జిలిస్‌తో ఇది ఆయనకు మూడవ సంతానం. ఈ బిడ్డ రహస్యం కాదని మస్క్ చెప్పాడు. ఈ చిన్నారి గురించి అయన తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పిల్లల పేరు, లింగం గురించి మస్క్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మస్క్ బిడ్డకు సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచాడని మీడియా లో వచ్చిన వార్తలను మస్క్ ఖండించాడు.

వివరాలు 

ఎలాన్ మస్క్ ఏం చెప్పారు? 

దీని గురించి మస్క్ సమాచారం ఇస్తూ, 'పిల్లల సమాచారాన్ని గోప్యంగా ఉంచడం విషయానికి వస్తే, ఇదంతా తప్పు. మా స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ ఈ విషయం తెలుసు. దీని గురించి ఎలాంటి పత్రికా ప్రకటన విడుదల చేయకపోవటం వింతగా ఉండొచ్చు కానీ.. అది రహస్యం కాదని అన్నారు. ఎలాన్ మస్క్, షివోన్ జిలిస్‌లకు మూడవ సంతానం. అంతకుముందు, షివోన్ జిలిస్ 2021 సంవత్సరంలో కవలలకు జన్మనిచ్చింది. స్ట్రైడర్,అజూర్. శివోన్ జిలిస్ మస్క్ బ్రెయిన్ ఇంప్లాంట్ సంస్థ న్యూరాలింక్‌లో పని చేస్తున్నారు.

వివరాలు 

జననాల రేటుపై మస్క్

మస్క్ 2000 సంవత్సరంలో జస్టిన్ విల్సన్‌ను మొదటిసారి వివాహం చేసుకున్నాడు.జస్టిన్, మస్క్‌లకు 5 మంది పిల్లలు ఉన్నారు. వారిద్దరూ 2008లో విడాకులు తీసుకున్నారు.దీని తరువాత, మస్క్ 2010లో తులులా రిలేని వివాహం చేసుకున్నాడు.వీరిద్దరూ 2016లో విడిపోయారు.2018లో, మస్క్ కెనడియన్ సంగీతకారుడు గ్రిమ్స్‌తో డేటింగ్ ప్రారంభించాడు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు. ఈ జంట 2021లో విడిపోయారు. తగ్గుతున్నజననాల రేటుపై మస్క్ చాలాసార్లు ప్రశ్నలు లేవనెత్తాడు. భర్తీ రేటు 2.1 పిల్లలు అని, త్వరలో ప్రపంచం ఈ రేటు కంటే తక్కువకు చేరుకుంటుందని ఆయన అన్నారు. పేజ్ సిక్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జూలై 2022లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, మస్క్ తనకు పెద్ద కుటుంబం కావాలని చెప్పాడు.