Page Loader
Elon Musk 'X' : 'ఎక్స్‌'లో మళ్లీ మార్పు.. ఆదాయం కోసం ఎలాన్ మస్క్‌ కీలక నిర్ణయం
ఆదాయం కోసం ఎలాన్ మస్క్‌ కీలక నిర్ణయం

Elon Musk 'X' : 'ఎక్స్‌'లో మళ్లీ మార్పు.. ఆదాయం కోసం ఎలాన్ మస్క్‌ కీలక నిర్ణయం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 23, 2023
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం 'X'కి సంబంధించి ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే గత నెలలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.X వేదికపై షేర్‌ చేసే లింక్స్‌కు హెడ్‌లైన్‌ కనిపించేలా తిరిగి మార్పులు చేస్తున్నామని తెలిపారు. 'X'లో వాణిజ్య ప్రకటనల నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోతున్న క్రమంలో మస్క్‌ (Musk) ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే గతంలో లాగా కాకుండా ఇకపై ఇమేజ్‌లపైనే లింక్‌కు సంబంధించిన హెడ్‌లైన్‌ కనిపిస్తుందన్నారు. పునరుద్ధరిస్తున్న ఈ హెడ్‌లైన్‌ ఆప్షన్‌కు సంబంధించి ఎలాన్‌ మస్క్‌ అదనపు వివరాలను ప్రస్తుతానికి వెల్లడించలేదు. మార్పులతో కూడిన ఆప్షన్ ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుంది,ఇమేజ్‌పై హెడ్‌లైన్‌ను ఎలా చూపించనున్నారన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు.

details

మళ్లీ మార్పులతో ఎంగేజ్ మెంట్లు పెరుగుతాయి : మస్క్

ఇదే సమయంలో లింక్‌ ప్రివ్యూలకు సంబంధించిన హెడ్‌లైన్లు కనిపించకుండా ' X'లో అక్టోబరులో మార్పులు చేశారు. నెల తిరగకముందే సదరు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్నారు. గతనెలలో చేసిన మార్పులతో వార్తలు, వ్యాసాలకు సంబంధించిన లింక్‌లు కనిపించే విధానమే తారుమారైంది. లింకులో ఉన్న విషయం తెలుసుకునేందుకు యూజర్లు లీడ్‌ ఇమేజ్‌ పైభాగంలో కనిపించే లింక్‌పై కచ్చితంగా క్లిక్‌ చేయాల్సిన స్థితి ఏర్పడింది. దీంతో వార్త, ప్రచురణ సంస్థలు లీడ్‌ ఇమేజ్‌పైనే హెడ్‌లైన్‌ను రాయడం ప్రారంభించాయి. యూజర్లు Xపై వెచ్చించే సమయాన్ని పెంచడం కోసం మళ్లీ మార్పులు చేస్తున్నామని మస్క్‌ ప్రకటించారు. ఈ కారణంగా ఎంగేజ్‌మెంట్‌ పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.