Whatsapp: సరికొత్త క్రేజీ ఫీచర్లను తీసుక రాబోతున్న వాట్సాప్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తోంది.
వీటి ద్వారా చాటింగ్ అనుభవం మరింత సులభతరంగా, సృజనాత్మకంగా మారుతోంది.
ఇటీవల ప్రవేశపెట్టబోయే అప్‌డేట్‌లో ఫోటో ఎడిటింగ్, సెల్ఫీ స్టిక్కర్ల తయారీ, మెసేజ్‌లకు త్వరగా రియాక్ట్ అయ్యే ఆప్షన్లు వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఉంటాయి.
ఈ కొత్త అప్‌డేట్‌లో ఫోటోలు, వీడియోలకు ప్రత్యేక హంగులు జోడించే అవకాశాలు లభిస్తాయి, షేర్ చేయడానికి ముందు వాటికి వివిధ ఫిల్టర్లు, బ్యాక్‌గ్రౌండ్లు, విజువల్ ఎఫెక్ట్స్ జోడించడం సాధ్యమవుతుంది.
30కి పైగా క్రియేటివ్ ఆప్షన్లను ఉపయోగించి మెసేజ్‌లను మరింత అర్థవంతంగా మార్చుకోవచ్చు.
వివరాలు
"క్రియేట్ స్టిక్కర్" ఆప్షన్
ఇప్పటివరకు అందుబాటులో లేని కొత్త ఫీచర్ అయిన 'సెల్ఫీ స్టిక్కర్' ద్వారా మీ సెల్ఫీని స్టిక్కర్‌గా మార్చుకోవచ్చు.
"క్రియేట్ స్టిక్కర్" ఆప్షన్ ఉపయోగించి సెల్ఫీ తీసుకుని, దాన్ని వ్యక్తిగతీకరించిన స్టిక్కర్‌గా రూపొందించవచ్చు.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలోనే ఐఓఎస్ యూజర్లకు కూడా అందించనున్నారు.
స్టిక్కర్ లవర్స్ కోసం మంచి వార్త ఏమిటంటే, మీకు నచ్చిన స్టిక్కర్ ప్యాక్‌లను స్నేహితులకు నేరుగా షేర్ చేయవచ్చు, తద్వారా మీ చాటింగ్ అనుభవం మరింత సరదాగా మారుతుంది.
వివరాలు
యూజర్ల ప్రైవసీ, డేటా సెక్యూరిటీలకు అధిక ప్రాధాన్యత
ఇక మెసేజ్‌లకు రియాక్ట్ అవ్వడం మరింత వేగవంతం కానుంది.
మెసేజ్‌పై డబుల్ ట్యాప్ చేయడం ద్వారా రియాక్షన్ సెట్ అవుతుంది, అలాగే ఎక్కువగా వాడే ఎమోజీలను స్క్రోలింగ్ మెనూ ద్వారా ఎంచుకోవచ్చు.
వాట్సాప్ 2025లో మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది, ముఖ్యంగా యూజర్ల ప్రైవసీ, డేటా సెక్యూరిటీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది.
మొత్తానికి ఈ అప్‌డేట్స్‌తో ఫోటో ఎడిటింగ్, సెల్ఫీ స్టిక్కర్లు, స్టిక్కర్ షేరింగ్, మెసేజ్ రియాక్షన్స్ వంటి ఫీచర్లు మీ చాటింగ్ అనుభవాన్ని మరింత సరదాగా, సులభతరంగా మార్చనున్నాయి.
వాట్సాప్ యూజర్లకు ఈ అప్‌డేట్స్ నిజమైన పండగగా నిలుస్తాయి.