Page Loader
Microsoft Office: మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌పై యూరప్‌ దేశాల నిషేధం.. ఎందుకో తెలుసా?
మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌పై యూరప్‌ దేశాల నిషేధం.. ఎందుకో తెలుసా?

Microsoft Office: మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌పై యూరప్‌ దేశాల నిషేధం.. ఎందుకో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా ఉపయోగించే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను యూరోపియన్ దేశాలు ఒకదానొకటిగా నిషేధించుకుంటున్నాయి. దీనికి సాంకేతిక పరమైన కారణాలకన్నా, వ్యూహాత్మక, రాజకీయ కారణాలే కీలకమయ్యాయి. జర్మనీ, డెన్మార్క్ వంటి దేశాలు ఇప్పటికే తమ ప్రభుత్వ వ్యవస్థల నుంచి మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులను క్రమంగా తొలగించే ప్రక్రియలో ఉన్నాయి. జర్మనీ ముందడుగు వేసింది జర్మనీకి చెందిన ఉత్తర రాష్ట్రం ష్లెస్విగ్-హోల్‌స్టెయిన్ ఇటీవల మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఆఫీస్ వంటి సాఫ్ట్‌వేర్‌ను తమ ప్రభుత్వ ఉపయోగం నుంచి తొలగించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా సాంకేతిక ఆధారిత స్వావలంబన అవసరమని అధికారులు పేర్కొన్నారు.

Details

డేటా భద్రతతో ఆర్థిక పరంగా దేశాలకు ప్రయోజనం

జర్మనీ డిజిటల్ మంత్రి డిర్క్ ష్రోడ్టర్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, దేశాలు కేవలం శక్తి పరంగా కాకుండా డిజిటల్ పరంగా కూడా స్వతంత్రంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయాలుగా ఓపెన్-సోర్స్ మైక్రోసాఫ్ట్ వర్డ్‌కు బదులుగా LibreOffice, అవుట్‌లుక్‌కు బదులుగా Open-Xchange వంటి ఓపెన్ సోర్స్ టూల్స్ వేగంగా ప్రసారమవుతున్నాయి. ఇది కేవలం డేటా భద్రత కోసమే కాక, ఆర్థిక పరంగా కూడా దేశాలకు ప్రయోజనం కలిగించనుంది. డెన్మార్క్ కూడా అదే దారిలో డానిష్ ప్రభుత్వం కూడా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను తగ్గించే దిశగా అడుగులు వేసింది. రాజధాని కోపెన్‌హాగన్ నగరంలో ఈ మార్పు మొదలైంది.

Details

లైసన్సు ఖర్చులు 72శాతం పెరిగాయి

భవిష్యత్తులో అమెరికా పట్ల రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినట్లయితే, కీలకమైన డేటా యాక్సెస్‌పై ఆధారపడకూడదన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒక అంతర్జాతీయ ప్రాసిక్యూటర్‌కు సంబంధించిన ఇమెయిల్ సేవను మైక్రోసాఫ్ట్ మూసివేసిన వ్యవహారం ఈ ఆందోళనలకు దారితీసింది. మైక్రోసాఫ్ట్ ఈ ఆరోపణలను తిరస్కరించినప్పటికీ, ఇది యూరప్‌లో అనేక ప్రభుత్వాలకు అనుమానాలు కలిగించింది. ఖర్చుతో కూడిన భారం మరొక ముఖ్యమైన కారణం లైసెన్స్ ఫీజులు. కోపెన్‌హాగన్ నగరంలో గత ఐదు సంవత్సరాలలో మైక్రోసాఫ్ట్ లైసెన్స్ ఖర్చులు 72 శాతం వరకు పెరిగాయి.

Details

డేటా భద్రతపై ఆధారపడి ఉంది

అందుకే ఉచిత, ఓపెన్-సోర్స్ ఎంపికలు మద్దతు పొందుతున్నాయి. ప్రభుత్వాలు బడ్జెట్‌ నిర్వహణను మెరుగుపరచడానికి ఇది సరైన మార్గంగా చూస్తున్నాయి. మొత్తం చూస్తే... మైక్రోసాఫ్ట్‌ను ప్రభుత్వ వ్యవస్థల నుంచి నిషేధించాలన్న యూరోపియన్ దేశాల నిర్ణయం వెనుక ఉన్న కారణాలు డేటా భద్రత, ఆర్థిక సాంకేతిక స్వావలంబన, రాజకీయ స్వతంత్రత అనే మూడింటిపై ఆధారపడి ఉన్నాయి. రానున్న కాలంలో మరిన్ని దేశాలు కూడా ఇదే బాట పట్టే అవకాశముంది.