Spotify new feature : ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా.. ఆఫ్‌లైన్‌లో పాటలు వినొచ్చు!
వినియోగదారుల కోసం స్పాటిఫై కొత్త పీఛర్ ను తీసుకొచ్చింది. ఇకపై ఆఫ్ లైన్‌లో డైరక్టుగా పాటలు వినొచ్చు. ఇంటర్నెట్ లేనప్పటికీ మ్యూజిక్ వినే విధంగా 'యువర్ ఆఫ్‌లైన్ మిక్స్' అనే కొత్త ఫీచర్ ను స్పాటిఫై తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులు ఆఫ్ లైన్ లో పాటలు వింటూ ఎంజాయ్ చేయవచ్చు. ఈ విషయాన్ని స్పాటిఫై సీఈఓ డానియల్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రపంచంలో అతిపెద్ద మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ గా స్పాటిఫై కొనసాగుతోంది. 500 మిలియన్ల మందికి పైగా యూజర్లు దీన్ని ఉపయోగిస్తున్నారు. యూజర్ల కోసం సంస్థ ఎప్పటికప్పుడు ప్రత్యేక ఫీచర్లను తీసుకొస్తూ ఆకట్టుకుంటోంది.
స్పాటిఫైలో 'యువర్ ఆఫ్ లైన్ మిక్స్' ఫీచర్
యువర్ ఆఫ్‌లైన్ మిక్స్ ఫీచర్ కు సంబంధించిన పెద్దగా సమాచారం తెలియడం లేదు. అయితే ఇంటర్నెట్ లభించని సమయంలో.. యూజర్లు రీసెంట్ ప్లే చేసిన మ్యూజిక్ ను కలిపి ఓ లిస్ట్ తయారు కానుందని, దాన్ని ఆఫ్ లైన్ లో వాడుకోవచ్చని తెలుస్తోంది. 2022 నుంచి ఈ ఫీచర్ పై సంస్థ ప్రయోగాలను చేస్తున్నట్లు సమాచారం. స్పాటిఫై ప్రీమియం సబ్ స్క్రైబర్లకు, మ్యూజిక్ ఆల్బమ్స్ ను డౌన్ లోడ్ చేసుకొని, ఆఫ్ లైన్ లో వినే అవకాశం ఉంది. ప్రతిసారి డౌన్ లోడ్ చేసుకొని పెట్టుకోవడం అంటే కష్టమని చెప్పొచ్చు. ఈ ఫీచర్ అందరికి వస్తుందా? లేదా ప్రీమియం సబ్ స్క్రైబరలు మాత్రమే పొందుతారా? అనేది తెలియాల్సి ఉంది.