WhatsApp: వాట్సాప్‌లో నకిలీ ఆర్టీఓ చలాన్ స్కామ్.. ఓపెన్ చేస్తే ఆమోంట్ మొత్తం ఖాళీ
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్ ద్వారా మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ చలాన్ పేరుతో నకిలీ సందేశాలు పంపి, వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేసే ప్రయత్నం జరుగుతోంది. సైబర్ నిపుణులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నకిలీ చలాన్ మెసేజ్ ఇటీవల అనేక మంది వినియోగదారులు 'మీ వాహనంపై ఆర్‌టీవో చలాన్ జారీ అయింది' అంటూ వచ్చిన సందేశాలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ సందేశాలు అధికారికంగా కనిపిస్తూ, వాటిలో 'RTO E-Challan.apk' లేదా 'MParivahan.apk' పేరుతో ఫైల్ అటాచ్ చేసి పంపిస్తున్నారు.
Details
హ్యాకింగ్ పన్నాగం
సైబర్ సెక్యూరిటీ నిపుణుడు అభిషేక్ యాదవ్ (@yabhishekhd) తెలిపిన వివరాల ప్రకారం, ఆ ఫైల్‌ను ఓపెన్ చేయగానే మీ ఫోన్ హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లే అవకాశం ఉంది. దాంతో మీ పర్సనల్ డేటా, బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌లు దొంగిలించబడే ప్రమాదం ఉంది. అంతేకాక, మీ పేరుతోనే ఆ స్కామ్ మెసేజ్ మీ కాంటాక్ట్‌లకు పంపించే అవకాశం కూడా ఉంటుంది. వాట్సాప్ అకౌంట్ బ్యాన్ ప్రమాదం కొంతమంది వినియోగదారులు ఈ ఫైల్‌ను ఓపెన్ చేసిన తర్వాత తమ వాట్సాప్ అకౌంట్‌లు బ్లాక్ లేదా బ్యాన్ అయ్యాయని చెబుతున్నారు. ఈ మోసం ప్రత్యేకంగా ప్రమాదకరం ఎందుకంటే అది నిజమైన ఆర్‌టీవో మెసేజ్‌లా కనిపిస్తుంది.
Details
ఎలా జాగ్రత్త పడాలి
సైబర్ నిపుణుల సూచనలు అపరిచిత నంబర్ల నుంచి వచ్చిన APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయొద్దు. గూగుల్ ప్లే స్టోర్ వంటి అధికారిక వనరుల ద్వారానే యాప్‌లు ఇన్‌స్టాల్ చేయాలి. అనుమానాస్పద లింకులు లేదా ఫైళ్లపై క్లిక్ చేయకూడదు. ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు వెంటనే డిలీట్ చేయండి, అలాగే ఇతరులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఒక్క క్లిక్‌తోనే మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్లిపోవచ్చు!