Sunita Williams : నింగిలోకి ఫాల్కన్ 9.. త్వరలో భూమిపైకి రానున్న సునీతా విలియమ్స్!
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రానుండటం ఖాయమైంది.
నాసా-స్పేస్ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.
భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సుల్‌ను ప్రయోగించి, నలుగురు వ్యోమగాములు మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ ఐఎస్‌ఎస్‌కు చేరుకునేలా నడిపించారు.
Details
తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్ లోనే సునీతా విలయమ్స్
సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ దాదాపు తొమ్మిది నెలలుగా ఐఎస్‌ఎస్‌లోనే ఉన్నారు. వారిని భూమికి తిరిగి తీసుకురావడానికి నాసా-స్పేస్ ఎక్స్‌లు క్రూ-10 మిషన్‌ను చేపట్టాయి.
ఫాల్కన్ 9 రాకెట్‌ను మూడ్రోజుల క్రితం ప్రయోగించాలని అనుకున్నా గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగం రద్దయింది.
అయితే తాజాగా రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో సునీత త్వరలో భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది.
Details
క్రూ-10 మిషన్ విజయవంతం
2024 జూన్ 5న సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ద్వారా టెస్ట్ మిషన్‌లో అంతరిక్షానికి వెళ్లారు.
ఎనిమిది రోజుల తర్వాత భూమికి తిరిగి రావాల్సి ఉన్నా, ఐఎస్‌ఎస్‌కు చేరిన వెంటనే నౌకలో సమస్యలు తలెత్తాయి.
ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు, థ్రస్టర్స్ మూసుకుపోవడం, హీలియం అయిపోవడంతో, ఈ నౌక ద్వారా వ్యోమగాములను భూమికి తీసుకురావడం సురక్షితం కాదని నాసా ఆగస్టులో నిర్ణయించుకుంది.
ఈ నేపథ్యంలో, బోయింగ్ స్టార్‌లైనర్‌ను 2024 సెప్టెంబర్ 7న వ్యోమగాములు లేకుండా భూమికి తిరిగి పంపారు. అప్పటి నుంచి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఐఎస్‌ఎస్‌లోనే ఉన్నారు.
ఇప్పుడు క్రూ-10 మిషన్ విజయవంతంగా పూర్తవడంతో, వారు త్వరలో భూమిపై అడుగుపెట్టనున్నారు.