Page Loader
ఐఫోన్ 15 Pro ఫీచర్స్ గురించి తెలుసుకుందాం
టైటానియం ఫ్రేమ్‌ సాధారణ మోడల్‌ల కంటే దృఢంగా ఉంటాయి

ఐఫోన్ 15 Pro ఫీచర్స్ గురించి తెలుసుకుందాం

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 21, 2023
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

Pro సిరీస్ ఐఫోన్‌లు ప్రత్యేకంగా కనిపించేలా చేయడానికి, ఆపిల్ ఫీచర్స్ ను మారుస్తుంది. Pro ఐఫోన్‌ని ఎంచుకున్నప్పుడు స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్, మరింత సామర్థ్యం గల ట్రిపుల్ కెమెరా సెటప్, మెరుగైన డిస్‌ప్లే కూడా ఇందులో ఉంటాయి. ఆపిల్ ఐఫోన్ 15 Pro కూడా అలాగే తేలికగా కనిపించేలా అనుభూతి చెందడానికి ప్రత్యేకంగా రూపొందుతుంది. ఐఫోన్ 15 Pro మాక్స్ మొదటిసారి ఐఫోన్‌లో టైటానియం ఫ్రేమ్‌తో వస్తున్నాయని ఈమధ్య అయిన లీక్స్ ద్వారా తెలుస్తుంది. దీనివల్ల సాధారణ మోడల్‌ల కంటే దృఢంగా ఉంటాయి. ఐఫోన్ 15 Proతో ఉన్న దృఢమైన ఫ్రేమ్‌తో పాటు, యాపిల్ మెరుగైన ఇన్-హ్యాండ్ ఫీల్ కోసం కొద్దిగా వంగిన ఫ్రేమ్‌లను కూడా తిరిగి ప్రవేశపెట్టవచ్చు.

ఐఫోన్

ఐఫోన్ 15 Pro దాని ముందు మోడల్ కంటే ఎక్కువ ధర ఉంటుంది

ఐఫోన్ 15 Pro సిరీస్‌లో టైటానియం ఫ్రేమ్‌లను ఉపయోగించడం ద్వారా ఆపిల్ ఐఫోన్‌లను ధృడంగా చేస్తుంది, అయితే, ఐఫోన్ 14 Proలో ఉపయోగించే సర్జికల్-గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ కంటే టైటానియం ఖరీదైనది. ఐఫోన్ 15 Pro దాని ముందు మోడల్ కంటే ఎక్కువ ధర ఉంటుంది. ఆపిల్ వాచ్ ప్రస్తుత తరంతో, టైటానియం ఫ్రేమ్ అల్ట్రా ఆప్షన్ కు పరిమితం అయింది. అయితే, ఆపిల్ వాచ్ సిరీస్ 5, 6 సిరీస్ 7లో, కంపెనీ మూడు వేర్వేరు మెటీరియల్‌లలో డివైజెస్ అందించింది. అత్యంత సరసమైన మోడల్ అల్యూమినియం ఫ్రేమ్‌ ఉండగా, మిడ్-టైర్ వేరియంట్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్‌తో చివరగా, హై-ఎండ్ మోడల్‌లో టైటానియం ఫ్రేమ్ ఉంది.