అంగారక గ్రహం నుంచి భూమికి మొదటిసారిగా సందేశం; అది ఏలియన్ సిగ్నలేనా?
సువిశాల విశ్వంలో జీవం ఎక్కడైనా ఉందా? అనే కోణంలో దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే గ్రహాంతరవాసులు ఉన్నారని కొందరు శాస్ర్తవేత్తలు చెబుతున్నా, ఈ వాదనకు నిర్దిష్టమైన ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక ఘటన గ్రహాంతరవాసులు ఉన్నారనే వాదనను బలపరుస్తుంది. ఇటీవల అంగారక గ్రహం నుంచి భూమికి మొదటిసారిగా ఒక సందేశం వచ్చింది. ఈ సందేశాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ (టీజీఓ) ఎన్ కోడ్ చేసి భూమికి చేరవేసింది. ఈ సందేశాన్ని గ్రహాంతరవాసులు పంపినట్లు శాస్త్రవేత్తులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇందులో నిజమెంత? నిజంగా అది ఏలియన్లే పంపారా? అనే కోణంలో తెలుసుకునే పనిలో ఉన్నట్లు డీకోడింగ్ నిపుణుడు డానియెలా పాలిస్ అన్నారు.
డీకోడింగ్ చేసే ప్రాజెక్టులో ప్రపంచ శాస్త్రవేత్తలకు అవకాశం
సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ (ఎస్ఈటీఐ)ఇన్‌స్టిట్యూట్‌లో రెసిడెన్స్‌లో పని చేస్తున్న పాలిస్ ఆధ్వర్యంలో గ్రహాంతర సందేశాన్ని డీకోడింగ్, వివరించే ప్రక్రియను అన్వేషించడానికి ఒక ప్రాజెక్ట్‌ను రూపొందించడానికి అంతర్జాతీయ నిపుణులు, అంతరిక్ష శాస్త్రవేత్తలు ఒక బృందంగా ఏర్పడ్డారు. అంతేకాకుండా డీకోడింగ్ చేసే ప్రాజెక్టులో ప్రపంచ దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలను ఇందులో భాగస్వామ్యం చేయాలని 'ఎ సైన్ ఇన్ స్పేస్' నిర్ణయించింది. ఒక వేళ ఈ సందేశాన్ని గ్రహాంతరవాసులు పంపుతే ఇది చరిత్రే అవుతుందని 'ఎ సైన్ ఇన్ స్పేస్' పేర్కొంది. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని వెల్లడించింది.