
Meta AI researcher: 'మెటాస్టాటిక్ క్యాన్సర్'గా మారిన మెటా సంస్కృతి?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సాంకేతిక సంస్థ మెటా,సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు వేగంగా ముందుకు సాగుతుండగా,ఆ సంస్థలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సంస్థను వీడి బయటకు వెళ్లే సమయంలో అతడు మెటాలోని కృత్రిమ మేధ విభాగంపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఒక అంతర్గత ఈమెయిల్‌ను పంపాడు. ఈ అంశంపై "ది ఇన్ఫర్మేషన్"లో టిజ్మెన్ బ్లాంకెవర్ట్ రాసిన కథనంలో,మెటాలో నెలకొన్న పని సంస్కృతిని ఆయన "మెటాస్టాటిక్ క్యాన్సర్"తో పోల్చారు. బ్లాంకెవర్ట్ కొంతకాలం పాటు మెటా అభివృద్ధి చేసిన ఎల్ఎల్ఏఎమ్ఏ (LLaMA)మోడళ్లపై పని చేసిన బృందంలో పనిచేశాడు.
వివరాలు
ఉద్యోగాల తొలగింపులు ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్నితీవ్రంగా దెబ్బతీశాయి
సంస్థను వీడే ముందు, తన ఉద్యోగ విరమణకు సంబంధించినంత వరకు, సంస్థ నాయకత్వంపై, అక్కడి విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ ఒక విస్తృతమైన లేఖను రాశాడు. అతడి లేఖలో పేర్కొన్న విషయాల ప్రకారం.. ''మెటాలో నేను పనిచేసిన కాలంలో ఎంతోమంది ఉద్యోగులు తగిన నష్టాన్ని ఎదుర్కొన్నారు. సంస్థలో భయంతో నిండిన వాతావరణం ఏర్పడింది. తరచూ జరిగే పనితీరు సమీక్షలు, ఉద్యోగాల తొలగింపులు ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని,వారి సృజనాత్మకతను తీవ్రంగా దెబ్బతీశాయి.ప్రస్తుతం మెటా కృత్రిమ మేధ విభాగంలో 2,000 మందికిపైగా ఉద్యోగులు ఉన్నా,దానికి స్పష్టమైన దిశ లేదు. చాలా మంది ఉద్యోగులు అక్కడ పనిచేయడాన్ని ఇష్టపడటం లేదు. తమ మిషన్ ఏమిటో కూడా వారికి తెలియదు.తరచూ సంస్థ అంతర్గతంగా కలహాలు,అస్పష్టమైన లక్ష్యాలు మిగిలేలా చేస్తోంది.
వివరాలు
'సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్' పేరుతో కొత్త విభాగం ప్రారంభం
ఇది జట్టు నూతన ఆవిష్కరణల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.ఈ పరిస్థితి,కేవలం పనితీరును మాత్రమే కాదు,మొత్తం సంస్థను ప్రభావితం చేసే రీతిలో ఉంది. ఇది ఒక 'మెటాస్టాటిక్ క్యాన్సర్'లా వ్యవహరిస్తోంది'' అని ఆయన పేర్కొన్నారు. ఓపెన్ఏఐ, గూగుల్ డీప్‌మైండ్ వంటి టెక్ దిగ్గజ సంస్థలతో పోటీ పడేందుకు మెటా తన కృత్రిమ మేధ కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో, మెటా ఇటీవల 'సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్' అనే కొత్త విభాగాన్ని ప్రారంభించింది. ఈ విభాగం ప్రధానంగా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) అభివృద్ధిపైనే దృష్టి సారించనుంది. పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు మెటా భారీగా పెట్టుబడులు పెడుతోంది. అవసరమైతే ఎంత ఖర్చయినా వెనుకాడకుండా అమర్చేందుకు సిద్ధంగా ఉంది.