ISRO : గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ పరీక్షలకు సిద్ధం.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో
నింగిలోకి వెళ్లి వచ్చే వ్యోయగాములకు చెందిన క్రూ మాడ్యూల్‌ను ఇస్రో త్వరలో పరీక్షించనుంది. భారత తొలి మానవసహిత అంతరిక్ష'గగన్‌యాన్'కు ప్రస్తుతం సన్మాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ఇస్రో కీలక ప్రకటన చేసింది. గగన్‌యాన్ మిషన్‌కు చెందిన టెస్ట్ వెహికల్ ఆ బోర్డు మిషన్-1 రూపుదిద్దుకున్నట్లు టీవీ-డీ1 మాడ్యూల్ ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. నింగిలోకి వెళ్లి వచ్చే వ్యోమగాములకు చెందిన క్యూ మాడ్యూల్‌ను ఇస్రో త్వరలో పరీక్షీంచనుంది. ప్రస్తుతం టెస్టింగ్ కోసం ఆ మాడ్యూల్‌ను నింగిలోకి పంపి, మళ్లీ భూమిపైకి దించనున్నారు.
బెంగళూరులోని ఇస్రో సెంటర్ లో క్రూ మాడ్యూల్ కు పరీక్షలు
టీవీ-డీ1 మాడ్యూల్ నిర్మాణం తుది దశలో ఉందని, ఈ మాడ్యూల్ 17 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత, అబార్ట్ సీక్వెన్స్‌లో భాగంగా మళ్లీ భూమి మీదకు వస్తుందని ఇస్రో ప్రకటించింది. ఇక శ్రీహరి కోట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర ప్రాంతంలో ఆ మాడ్యూల్ ల్యాండ్ కానుంది. ప్రస్తుతం క్రూ మాడ్యూల్‌ను బెంగళూరులోని ఇస్రో సెంటర్‌లో పరీక్షలు చేశారు. టెస్ట్ ప్లయిట్ సక్సెస్ అయితే తర్వాత గగన్‌యాన్ మిషన్ చేపట్టనున్నారు. గగన్‌యాన్ ద్వారా వ్యోమగాములను తక్కువ భూ కక్ష్యలోకి పంపి, సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా ఇస్రో పెట్టుకుంది.