WhatsApp: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. వెబ్ వెర్షన్‌లోనే గ్రూప్ వీడియో, వాయిస్ కాల్స్
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్ వినియోగదారులు చాల కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుందని సమాచారం. వాట్సాప్ వెబ్ ద్వారా నేరుగా గ్రూప్ వీడియో కాల్స్, గ్రూప్ ఆడియో కాల్స్ చేయగల అవకాశం త్వరలో అందనుంది. ఇప్పటివరకు ఈ సౌకర్యం కేవలం విండోస్ యాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌ల వరకు పరిమితం అయి ఉండగా, ఇకపై బ్రౌజర్ నుంచే గ్రూప్ కాల్స్ చేయవచ్చు. ప్రసిద్ధ వెబ్‌సైట్ 'WABetainfo' ప్రకారం, వాట్సాప్ వెబ్‌లో ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. ప్రస్తుతం బీటా వెర్షన్ కూడా విడుదల కాలేదు. కొత్త ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు WABetainfo షేర్ చేసింది. ప్రస్తుతంగా వాట్సాప్ వెబ్‌లో గ్రూప్ చాట్ ఓపెన్ చేస్తే పైభాగంలో వీడియో కాల్ ఐకాన్ కనిపిస్తుంది.
Details
అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
అయితే దానిపై క్లిక్ చేస్తే 'Windows యాప్ ద్వారా గ్రూప్ కాల్స్ చేయండి' అనే సందేశం వస్తోంది. కొత్త ఫీచర్ అమల్లోకి వచ్చిన తరువాత, విండోస్ యాప్ అవసరం లేకుండా, నేరుగా వెబ్ నుండి గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ చేయవచ్చు. ఇది ల్యాప్‌టాప్, పబ్లిక్ కంప్యూటర్ వాడే సందర్భాల్లో సులభత కలిగిస్తుంది, ముఖ్యంగా ఆఫీసులు, విద్యా సంస్థల కోసం ఉపయోగకరంగా ఉంటుంది ప్రారంభ దశలో కొన్ని పరిమితులు ఉండవచ్చని సమాచారం ఉంది. వీడియో కాల్స్ స్టాండర్డ్ క్వాలిటీ లేదా హెచ్‌డీకి మద్దతిస్తాయా అనే అంశాలు ఇంకా స్పష్టత రాలేదు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంకా, వాట్సాప్ కవర్ ఫోటోలు విషయంలోనూ కొత్త గోప్యతా ఫీచర్లు తీసుకొచ్చింది.
Details
అందుబాటులో నూతన 'ప్రైవసీ కంట్రోల్స్'
బీటా వెర్షన్‌లో iOS వినియోగదారుల కోసం కొత్త 'ప్రైవసీ కంట్రోల్స్' అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా తమ కవర్ ఫోటోలను ఎవరు చూడాలో వినియోగదారులు స్వయంగా నిర్ణయించగలరు. మొత్తం మీద వాట్సాప్ వెబ్‌లో గ్రూప్ కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి రావడం ద్వారా, వినియోగదారుల అనుభవం మరింత సౌకర్యవంతంగా, మెరుగ్గా మారనుందని నిపుణులు భావిస్తున్నారు.