
WhatsApp : వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక తేదీతో మెసేజ్‌లు వెతకొచ్చు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది.
'సెర్చ్ మెసేజ్ బై డేట్' పేరుతో కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇక వాట్సప్‌లోని మెసేజ్‌లను తేదీ ఆధారంగా సులభంగా వెతకడానికి ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.
ఈ విషయాన్ని వాట్సప్‌కు చెందిన వాబీటా ఇన్ఫో స్పష్టం చేసింది.
సాధారణంగా వాట్సప్‌లో ఎవరి మెసేజ్‌లు అయినా వెతకాలంటే సెర్చ్ ఆప్షన్‌ను ఎంచుకుంటాం.
ఇక ఇరువురి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో మనకు గుర్తులేనప్పుడు పాత సందేశాలను వెతకడం పరిపాటి.
ఇక చాట్ చేసిన వాళ్లో, గ్రూప్ లైతే స్క్రోల్ చేస్తూ వెతకాల్సి ఉంటుంది.
Details
సెర్చ్ మెసేజ్ బై డేట్ ఫీచర్ ను తీసుకొచ్చిన ఫీచర్
ఇది కాకుండా ఫలానా రోజున మెసేజ్ పంపించారని గుర్తుంటే వెంటనే ఆ రోజు సందేశాలను సులువుగా వెతికే ఆస్కారం ఉంటుంది.
ఇక అలా కుండా వాట్సప్ సంస్థ 'సెర్చ్ మెసేజ్ బై డేట్' ఫీచర్ ను తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ ను వాడాలంటే సంబాషణలు వెతకటానికి సెర్చ్ బార్ కి వెళ్లగానే అక్కడ క్యాలెండర్ కనిపిస్తుంది.
అందులో మనకు సంవత్సరం, నెల, తేదీని ఎంచుకోవాలి. అంతే ఆ రోజుకు సంబంధించిన టెక్ట్స్, వాయిస్ మెసేజ్‌లు మనకు కన్పిస్తాయి. దీనివల్ల సమయం కూడా ఆదా అవుతుంది.
ప్రస్తుతం వాట్సప్ వెబ్ బీటా వెర్షన్ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.