LOADING...
Mini Projectors: ఇక థియేటర్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే సినిమా హాల్ అనుభూతి!
ఇక థియేటర్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే సినిమా హాల్ అనుభూతి!

Mini Projectors: ఇక థియేటర్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే సినిమా హాల్ అనుభూతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 24, 2026
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరికొద్ది రోజుల్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌లు మొదలైతే అభిమానులు టెలివిజన్లు, స్మార్ట్‌ ఫోన్‌లకు అతుక్కుపోయి లైవ్ మ్యాచ్‌లను ఆస్వాదించడం ఖాయం. అయితే పెద్ద స్క్రీన్‌పై ప్రత్యక్ష క్రికెట్‌ను చూడాలనుకుంటే అలాగే సినిమా థియేటర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందాలంటే 'పోర్టబుల్ మినీ ప్రొజెక్టర్' బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో రూ.5 వేలలోపే లభిస్తున్న బెస్ట్ మినీ ప్రొజెక్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.

Details

ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే మినీ ప్రొజెక్టర్

ఫ్లిప్‌కార్ట్‌లో స్టీపిఫై HY320 మినీ 4K ప్రొజెక్టర్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.3,600 మాత్రమే. ఈ ప్రొజెక్టర్ 4K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, బిల్ట్-ఇన్ స్పీకర్‌తో పాటు వైర్‌లెస్ కనెక్టివిటీ కూడా ఇందులో లభిస్తుంది. పోర్ట్రోనిక్స్ మినీ ప్రొజెక్టర్ పోర్ట్రోనిక్స్ బీమ్ 440 ఒక 720p HD రిజల్యూషన్ కలిగిన స్మార్ట్ LED ప్రొజెక్టర్. అమెజాన్ సేల్ సమయంలో దీని ధర రూ.4,788గా ఉంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లు ముందే అందుబాటులో ఉంటాయి.

Details

జెబ్రోనిక్స్ పోర్టబుల్ ప్రొజెక్టర్

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో జెబ్రోనిక్స్ జెబ్-పిక్సా ప్లే మినీ ప్రొజెక్టర్ రూ.4,999కే లభిస్తోంది. ఇది బిల్ట్-ఇన్ స్పీకర్లతో వస్తుంది. గరిష్ఠంగా 254 సెం.మీ వరకు స్క్రీన్ వ్యూ అందించడం దీని ప్రత్యేకత. లైఫ్‌లాంగ్ పోర్టబుల్ మినీ ప్రొజెక్టర్ లైఫ్‌లాంగ్ లైట్‌బీమ్ అనే మినీ ప్రొజెక్టర్ 720p HD రిజల్యూషన్‌తో పాటు 4K సపోర్ట్‌ను అందిస్తుంది. బిగ్ బాస్కెట్‌లో దీని ధర రూ.4,999గా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. అలాగే వైఫై సపోర్ట్ కూడా ఉంది.

Advertisement

Details

అమెజాన్ E GATE Atom మినీ ప్రొజెక్టర్

అమెజాన్ ఇండియా E GATE Atom అనే పోర్టబుల్ మినీ ప్రొజెక్టర్‌ను అందిస్తోంది. ఇది 4K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.4,870. ఈ ప్రొజెక్టర్‌లో Wi-Fi, బ్లూటూత్, స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. క్రికెట్ మ్యాచ్‌లు అయినా, సినిమాలు అయినా పెద్ద స్క్రీన్‌పై ఆస్వాదించాలనుకునేవారికి ఇవి తక్కువ బడ్జెట్‌లో మంచి ఎంపికలుగా నిలుస్తున్నాయి.

Advertisement