Google: గూగుల్ కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్.. ప్రభాకర్ రాఘవన్..ఆయన ఎవరో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ కంపెనీకి చీఫ్ టెక్నాలజిస్ట్‌గా ప్రభాకర్ రాఘవన్ నియమితులైనట్లు సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.
గత 12 ఏళ్లుగా గూగుల్‌కు సేవలందిస్తున్న రాఘవన్ గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, జియో, యాడ్స్, కామర్స్ వంటి ప్రధాన విభాగాల్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
వివరాలు
ప్రభాకర్ రాఘవన్ ఎవరు?
భారతదేశంలో జన్మించిన ప్రభాకర్ రాఘవన్ 1981లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు.
ఆ తరువాత 1982లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాంటా బార్బరా నుంచి ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.
1986లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్ పూర్తి చేసుకున్నారు.
2012లో గూగుల్‌లో చేరిన రాఘవన్,అంతకుముందు యాహూలో కీలక పదవిలో ఉన్నారు.
గూగుల్‌లో చేరిన తరువాత,సెర్చ్ అండ్ యాడ్ ర్యాంకింగ్,యాడ్ మార్కెట్‌ప్లేస్ డిజైన్ వంటి ముఖ్యమైన అంశాల్లో పనిచేశారు.
ఆ తరువాత గూగుల్ యాప్స్, గూగుల్ క్లౌడ్ విభాగాల్లోనూ పనిచేశారు.ఆయన స్మార్ట్ రిప్లై,స్మార్ట్ కంపోజ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు.
వివరాలు
2018లో ప్రోడక్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్
2018లో గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, యాడ్స్, కామర్స్, పేమెంట్స్ వంటి ప్రొడక్టుల సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులైన రాఘవన్ నాయకత్వంలో సరికొత్త AI ఆధారిత ఫీచర్లు ప్రారంభమయ్యాయి.
ఈ ఫీచర్లలో సర్కిల్ టు సెర్చ్, లెన్స్ ద్వారా షాపింగ్ చేయడం వంటి విభిన్న ఫీచర్లు ఉన్నాయి.
ప్రస్తుతం ఆయన గూగుల్ చీఫ్ టెక్నాలజిస్ట్‌గా పదవిని స్వీకరించారు.