Page Loader
ఆండ్రాయిడ్‌ chromeలో సెర్చ్ హిస్టరీని త్వరగా తొలగించే ఫీచర్ ను ప్రవేశపెట్టనున్న గూగుల్
ఈ ఫీచర్ 2021లో ఐఫోన్ అప్డేట్ లో విడుదల అయింది

ఆండ్రాయిడ్‌ chromeలో సెర్చ్ హిస్టరీని త్వరగా తొలగించే ఫీచర్ ను ప్రవేశపెట్టనున్న గూగుల్

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 06, 2023
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆండ్రాయిడ్ chromeలో 'quick delete' ఫీచర్‌ను ప్రారంభించే పనిలో గూగుల్ ఉంది. వెబ్ బ్రౌజింగ్ యాప్‌లో చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ 2021లో ఐఫోన్ అప్డేట్ లో విడుదల చేసారు. ఈ సంవత్సరం, గూగుల్ ఈ ఫీచర్ ను బ్రౌజర్ ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం విడుదల చేయబోతుంది. సెన్సిటివ్ బ్రౌజింగ్ డేటాను తొలగించడానికి 'quick delete' ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే, ఈ సదుపాయం కేవలం బ్రౌజింగ్ డేటాను తొలగిస్తుందా లేదా ఆండ్రాయిడ్ Chromeలో మిగిలినవాటిని కూడా తొలగిస్తుందా అనే దానిపై ఇంకా సృష్టత లేదు. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

గూగుల్

సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్లకుండానే సెర్చ్ హిస్టరీ తొలగించచ్చు

ప్రకటించిన రెండు నెలల తర్వాత (జూలైలో) ఐఫోన్ వినియోగదారులకు ఈ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. 'quick delete' ఫీచర్ ప్రస్తుతం Chrome ఐఫోన్ వెర్షన్‌లో ప్రొఫైల్ పై నొక్కిన తర్వాత, "Search History" కింద "Delete last 15 min" బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే చివరి 15 నిమిషాలు సెర్చ్ చేసిన అంశాలు డిలీట్ అవుతాయి. సురక్షిత బ్రౌజింగ్ కోసం ఇప్పటికే Incognito mode ఉన్నప్పటికీ, Chrome ఆండ్రాయిడ్ వెర్షన్‌లో సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్లకుండానే ప్రైవసీ ఆప్షన్స్ ను మెరుగుపరచడంపై పని చేస్తోంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి ఎప్పుడు వస్తుందనేది ఇంకా తెలియలేదు.