Page Loader
ఆండ్రాయిడ్ విభాగంలో తగ్గనున్న గూగుల్ ఆధిపత్యం
CCI గూగుల్ పై 1,337.76 కోట్ల జరిమానా విధించింది

ఆండ్రాయిడ్ విభాగంలో తగ్గనున్న గూగుల్ ఆధిపత్యం

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 27, 2023
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

గత వారం ఆండ్రాయిడ్‌కు సంబంధించిన వ్యాపార విధానాలను మార్చాలని సంస్థను కోరుతూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆర్డర్‌కు వ్యతిరేకంగా గూగుల్ చేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి భారత సుప్రీంకోర్టు నిరాకరించింది. అందుకే దేశంలో ఆండ్రాయిడ్ లైసెన్సింగ్‌కు సంబంధించిన కొన్ని మార్పులను గూగుల్ ప్రకటించింది. గూగుల్ భారతదేశంలో యాంటీట్రస్ట్ చర్యలను ఎదుర్కొంటోంది. ఇతర దేశాలు CCI నుండి ప్రేరణ పొంది ఇలాంటి పరిమితులను విధించే అవకాశం ఉంది. అయితే ఇకపై ఆండ్రాయిడ్ వ్యాపారంలో గూగుల్ ఆధిపత్యం తగ్గినట్టే కనిపిస్తుంది. CCI ఆదేశాలు ప్రకారం స్మార్ట్ ఫోన్ల కోసం గూగుల్ తన యాప్‌ల అన్నిటిని ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయదు. ఇది BharOS వంటి ప్రత్యర్థులతో మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్‌లో పోటీని పెంచడానికి దారితీస్తుంది.

గూగుల్

ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ సెర్చ్ మాత్రమే ఉండదు

ఇక ఫోన్ వినియోగదారుడి చేతికి వచ్చేసరికి చాలా మార్పులు జరుగుతాయి. ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ సెర్చ్ మాత్రమే ఉండదు. వినియోగదారులు తమకు నచ్చిన సెర్చ్ ఇంజిన్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. సైడ్‌లోడెడ్ యాప్‌లను కూడా వినియోగదారులు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయగలరు. థర్డ్-పార్టీ యాప్ స్టోర్‌లు ప్లే స్టోర్ మాదిరిగానే ఆటోమేటిక్ యాప్ అప్‌డేట్‌లను అందించగలవు. గూగుల్ ప్రవేశపెట్టిన మరో మార్పు ప్లే స్టోర్ బిల్లింగ్‌కు సంబంధించినది. వచ్చే నెల నుండి భారతదేశంలోని వినియోగదారులు యాప్‌లో కొనుగోళ్లు చేస్తున్నప్పుడు గూగుల్ ప్లే కాకుండా ఇతర బిల్లింగ్ సిస్టమ్‌ను ఎంచుకోగలుగుతారు. ఇది యాప్‌లో కొనుగోళ్లలో 30% కోత పడే అవకాశం ఉంది. కొత్త మార్పు డెవలపర్‌లకు వారి లాభాలలో ఎక్కువ వాటాను అందిస్తుంది.