Page Loader
తాజా డిజైన్, కొత్త ఫీచర్‌లతో వర్క్‌స్పేస్ యాప్‌లను అప్డేట్ చేసిన గూగుల్
కొత్త యాడ్-ఆన్‌లు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి

తాజా డిజైన్, కొత్త ఫీచర్‌లతో వర్క్‌స్పేస్ యాప్‌లను అప్డేట్ చేసిన గూగుల్

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 24, 2023
06:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

డాక్స్, షీట్‌లతో సహా గూగుల్ తన వర్క్‌స్పేస్ అప్లికేషన్‌ల కోసం కొత్త ఫీచర్‌లను కొన్ని డిజైన్ మార్పులను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌లలో స్మార్ట్ కాన్వాస్, క్యాలెండర్ ఆహ్వాన టెంప్లేట్‌లు, వేరియబుల్స్, ఎమోజి ఓటింగ్ చిప్‌లు ఉన్నాయి. కొత్త యాడ్-ఆన్‌లు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. గూగుల్ వర్క్‌స్పేస్ అప్లికేషన్‌లు డాక్స్ నుండి షీట్‌ల వరకు, ప్రతి యుటిలిటీ యాప్ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సహాయం చేస్తోంది. అందువల్ల, టెక్ దిగ్గజం డిజైన్ ఫీచర్ల పరంగా దాని సాధనాలను తరచుగా అప్‌డేట్ చేస్తుంది. కొత్తగా ప్రకటించిన ఫీచర్లు వర్క్‌ఫ్లో అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. వినియోగదారుల ప్రాడక్టవిటీని పెంచడంలో, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడంలో సహాయపడుతుంది. డాక్స్‌లో స్మార్ట్ కాన్వాస్ సామర్థ్యాలను ఉపయోగించి అన్నీ రకాల టాస్క్‌లను పరిష్కరించగలరు.

గూగుల్

క్యాలెండర్ డ్రాఫ్ట్ ద్వారా డాక్స్‌లో క్యాలెండర్ ఆహ్వానాలను రూపొందించవచ్చు

క్యాలెండర్ డ్రాఫ్ట్' ద్వారా డాక్స్‌లో క్యాలెండర్ ఆహ్వానాలను రూపొందించవచ్చు. గూగుల్ థర్డ్-పార్టీ స్మార్ట్ చిప్ సామర్థ్యాలను కూడా యాడ్ చేసింది, ఇది వర్క్‌స్పేస్ యాప్‌ల అంతటా మరింత డేటా నేరుగా చూపిస్తుంది. ఇది Zendesk, Atlassian, Figma, Asana, Miro, Tableau వంటి థర్డ్-పార్టీ యాప్‌ల నుండి సమాచారం/ప్రివ్యూలను చూపిస్తుంది. గూగుల్ ఇప్పుడు ప్రాజెక్ట్‌లను ముందుకు తీసుకెళ్లడానికి Workspace యాప్‌ల నుండి మీరు తీసుకురాగల సమాచారం/డేటా రకాలను పెంచింది. రోజువారీ వర్క్‌ఫ్లో మరింత క్రమబద్ధీకరించడానికి గూగుల్ డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌లు, డ్రైవ్‌లో వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను కూడా మెరుగుపరిచింది. డిస్క్‌లో, ఒకేసారి వివిధ ఫైల్‌లను సులభంగా షేర్ చేయచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, తొలగించవచ్చు