LOADING...
Google: ఫిట్‌బిట్,పిక్సెల్ వాచ్ వినియోగదారుల కోసం కొత్త AI హెల్త్ కోచ్‌ని పరిచయం చేసిన గూగుల్ 
ఫిట్‌బిట్,పిక్సెల్ వాచ్ వినియోగదారుల కోసం కొత్త AI హెల్త్ కోచ్‌ని పరిచయం చేసిన గూగుల్

Google: ఫిట్‌బిట్,పిక్సెల్ వాచ్ వినియోగదారుల కోసం కొత్త AI హెల్త్ కోచ్‌ని పరిచయం చేసిన గూగుల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2025
11:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ తన "Made by Google" ఈవెంట్‌లో కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వ్యక్తిగత ఆరోగ్య కోచ్‌ను ప్రారంభించింది. జెమినీ టెక్నాలజీతో రూపొందించిన ఈ సౌలభ్యకర ఫీచర్ ఫిట్‌బిట్ పరికరాలలోకి ఇంటిగ్రేట్ చేయనుంది. ఇది ఫిట్‌నెస్ ట్రైనర్,స్లీప్ కోచ్, వేల్నెస్ సలహాదారుగా పనిచేసే ఒక సమగ్ర పరిష్కారం. అధునాతన AI హెల్త్ కోచ్ ప్రివ్యూ అక్టోబర్ నుంచి ఫిట్‌బిట్ ప్రీమియం వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. తాజా ఫిట్‌బిట్ ట్రాకర్లు, స్మార్ట్‌ వాచ్‌లు, పిక్సెల్ వాచ్‌లలో అప్‌డేటెడ్ యాప్ ద్వారా ఈ ఫీచర్ ఉపయోగించవచ్చు.

వివరాలు 

వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా AI కోచ్

కొత్త వ్యక్తిగత ఆరోగ్య కోచ్ వినియోగదారుల ప్రాధాన్యతలను గమనించి, ఫిట్‌బిట్ లేదా పిక్సెల్ వాచ్ నుండి రియల్-టైమ్ డేటాను ఉపయోగిస్తుంది. అవసరమైతే స్మార్ట్ వెయిట్ స్కేల్ లేదా గ్లూకోజ్ మానిటర్ డేటా కూడా తీసుకొని వినియోగదారుల ఆరోగ్యం మీద సమగ్ర అవగాహన పొందుతుంది. కోచ్ వినియోగదారులతో లక్ష్యం , ప్రాధాన్యతలు, అందుబాటులో ఉన్న సాధనాల గురించి చర్చించిన తర్వాత వ్యక్తిగత అనుకూల రొటీన్‌లు రూపొందిస్తుంది. అలాగే, వ్యక్తిగత అవసరాలకు తగిన వర్క్‌ఆవుట్ సూచనలు, లక్ష్యాలను కలిగి ఫిట్‌నెస్ ప్లాన్‌ను రూపొందిస్తుంది.

వివరాలు 

వర్క్‌ఆవుట్‌లను రియల్-టైమ్‌కి మార్చడం

వినియోగదారులు వర్క్‌ఆవుట్ చేస్తూ ఉండగా, AI కోచ్ రియల్-టైమ్ డేటా,ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్లాన్లను మార్చి లక్ష్యాన్నిసాధించడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, వినియోగదారు తక్కువ నిద్ర కారణంగా 'రెడినెస్ స్కోర్'(readiness score) తక్కువగా ఉంటే, కోచ్ వారపు ప్లాన్‌లో మార్పులు సూచిస్తుంది. అలాగే, జీవితంలో అనూహ్య పరిస్థితులు రొటీన్‌ను ప్రభావితం చేసినపుడు వినియోగదారులు కోచ్‌తో చాట్ చేసుకొని మార్పులు చేయవచ్చు.

వివరాలు 

నిద్ర నమూనాల విశ్లేషణ 

AI కోచ్ వినియోగదారుల నిద్ర నమూనాలను విశ్లేషించి, నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి సలహాలు ఇస్తుంది. గూగుల్ ప్రకారం,అధునాతన అల్గోరిథమ్స్ వినియోగదారుల నిద్ర వ్యవధి, దశలను మరింత బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. దీని ద్వారా వినియోగదారులు పిక్స్ పెర్ఫార్మెన్స్ కోసం సరైన నిద్ర అవసరాలను గుర్తించవచ్చు. రోజువారీ కార్యకలాపాలకు అనుగుణంగా వ్యక్తిగత నిద్ర షెడ్యూల్ క్రియేట్ చేస్తుంది.

వివరాలు 

పునర్వ్యవస్థీకరించిన ఫిట్‌బిట్ యాప్‌లో AI కోచ్

కొత్త AI కోచ్ పునర్వ్యవస్థీకరించిన ఫిట్‌బిట్ యాప్‌లో ఇంటిగ్రేట్ చేయబడింది, దీనిలో కోచింగ్, AI ప్రధానంగా ఉన్నాయి. వినియోగదారులు ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు వ్యక్తిగత, సైన్స్ ఆధారిత సమాధానాలు అడగవచ్చు. యాప్‌లో డేటా విజువలైజేషన్, సింక్ సామర్థ్యాలు మెరుగయ్యాయి.అంతేకాకుండా డార్క్ మోడ్ కూడా అందుబాటులో ఉంది, దీని ద్వారా వినియోగదారులకు మెరుగైన అనుభవం లభిస్తుంది.