మరికొద్ది రోజుల్లో గూగుల్ లాంచ్ ఈవెంట్.. తొలి ఫోల్డబుల్ ఫోన్ ప్రకటన!
Google I/O 2023: గూగుల్ ఐ/ఓ 2023 లాంచ్ ఈవెంట్‍లో మరికొద్ది రోజుల్లో జరగనుంది. పిక్సెల్ 7ఏతో పాటు తొలి ఫోల్డబుల్ ఫోన్‍ను గూగుల్ ప్రకటించనున్నట్లు సమాచారం. మే 10న ఈ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈవెంట్లో హార్డ్ వేర్ లాంచ్ లతో పాటు సాప్ట్ వేర్ అప్ గ్రేడ్ లను గూగుల్ ప్రకటించనుంది. ఇందులో ప్రకటించే టాప్-5 అంశాలపై ఓ లుక్కేద్దాం.. గూగుల్ పిక్సెల్ 7ఏ మొబైల్ గూగుల్ ఐ/ఓ 2023 ఈవెంట్ ద్వారా గ్లోబల్ గా లాంచ్ కానుంది. పిక్సెల్ 6ఏతో పొలిస్తే చాలా అప్ గ్రేడ్ లతో ఈ పిక్సెల్ 7ఏ ముందుకు రానుంది. దీని ధర 40వేలు ఉంటుందని అంచనాలున్నాయి.
ఈవెంట్లో 14 అనౌన్స్ మెంట్ లను చేసే అవకాశం
గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్ ను కూడా ఈవెంట్లో ప్రకటించనున్నారు. 10.95 ఇంచుల డిస్ ప్లే, గూగుల్ టెన్సార్ జీ2 ప్రాసెసర్ తో వచ్చ ఈ ట్యాబ్ 58 వేలు ఉండనున్నట్లు సమాచారం. గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ గూగుల్ నుంచి రానున్న తొలి ఫోల్డబుల్ ఫోన్.. 7.6 ఇంచుల ప్రైమరీ డిస్ ప్లే, 5.8 ఇంచుల కవర్ సెంకడరీ డిస్ ప్లే తో ఈ పోల్డబుల్ ఫోన్ వస్తోంది. దీని ధర రూ.1.40లక్షలు ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ గురించి పూర్తి సమాచారాన్ని ఈ ఈవెంట్లో గూగుల్ వెల్లడించనుంది. మొత్తంగా 14 ముఖ్యమైన అనౌన్స్‌మెంట్‍లను Google I/O 2023 ఈవెంట్లో గూగుల్ చేస్తున్నట్లు సమాచారం.