LOADING...
Gemini 3 Advances: ఏఐ పోటీలో గూగుల్ ముందంజ.. సామ్ ఆల్ట్మాన్ లీక్ మెమో వైరల్ 
ఏఐ పోటీలో గూగుల్ ముందంజ.. సామ్ ఆల్ట్మాన్ లీక్ మెమో వైరల్

Gemini 3 Advances: ఏఐ పోటీలో గూగుల్ ముందంజ.. సామ్ ఆల్ట్మాన్ లీక్ మెమో వైరల్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2025
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏఐ ప్రపంచాన్ని చర్చల్లోకి తెచ్చాయి. ఒక అంతర్గత మెమోలో ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీలో గూగుల్ ముందంజలో ఉందని, ముఖ్యంగా కొత్త Gemini 3 మోడల్‌తో వారి పురోగతి, ఓపెన్‌ఏఐకి తాత్కాలిక ఆర్థిక సవాళ్లను కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మెమో అనుకోకుండా లీక్ కావడంతో ఆల్ట్మాన్ మాటలు బహిరంగ చర్చకు వచ్చాయి. అయితే ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, ఉద్యోగులు నమ్మకంగా ఉండాలని, త్వరలోనే ఓపెన్‌ఏఐ మళ్లీ అగ్రస్థానాన్ని తిరిగి సాధించగలదని ఆల్ట్మాన్ ధైర్యం నింపారు. చాట్‌జీపీటీని రూపొందించిన సంస్థగా, ఏఐ రంగంలో తిరిగి నేతృత్వం వహించే స్థాయి తమకుందని ఆయన నమ్మకంగా చెప్పినట్లు తెలుస్తోంది.

Details

ఓపెన్‌ఏఐ వృద్ధి రేటు క్షీణిత

అంతేకాక Google ఇటీవలి విజయాల గురించి కూడా ఆల్ట్మాన్ ఆశావహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. Gemini-3 విడుదలకు ముందే రాసిన ఈ మెమోలో, గూగుల్ పురోగతి తమపై ప్రభావం చూపుతుందని అంగీకరించినా, ఓపెన్‌ఏఐ పరిశోధన వేగం, అభివృద్ధి గణనీయంగా కొనసాగుతోందని తెలిపారు. ఈ వేసవి చివర్లో ఓపెన్‌ఏఐ వృద్ధి రేటు కొంత మందగించడంతో సంస్థలో కొన్ని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పెట్టుబడిదారులతో జరిగిన తాజా త్రైమాసిక కాల్‌లో కంపెనీ CFO సారా ఫ్రియర్ ఒక్క ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. చాట్‌జీపీటీకి వినియోగదారుల ఎంగేజ్‌మెంట్ కొంత తగ్గిందని, అయినప్పటికీ మొత్తం ఆదాయ పరంగా సంస్థ బలంగా ఉందని ఆమె స్పష్టం చేశారు.

Details

వివిధ రంగాలకు విస్తరించే సామర్థ్యం

ఇక గూగుల్ విషయానికి వస్తే అవి భారీ ఆర్థిక ప్రయోజనాలతో కూడిన సంస్థ. ఓపెన్‌ఏఐ దాదాపు $500 బిలియన్ విలువ కలిగి ఉన్న లాభాపేక్షలేని సంస్థగా ఉన్నప్పటికీ, సుమారు $13 బిలియన్ ఆదాయాన్ని తెచ్చే అవకాశం ఉందని అంచనా. ఇదే సమయంలో ఓపెన్‌ఏఐ పరిశోధనా బృందం అధిక మేధస్సు (Super Intelligence) సాధనపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆల్ట్మాన్ తన మెమోలో స్పష్టంగా పేర్కొన్నారు. మోడల్స్‌ను వేగంగా అభివృద్ధి చేసి, వాటిని వివిధ రంగాలకు విస్తరించే సామర్థ్యం మా బలం. ఈ పోటీలో నిలబడేందుకు ఇప్పుడే మరింత శక్తివంతమైన స్థాయి నిర్మించుకోవాలి" అని ఆయన మెమోలో వివరించారు.