
Smart Phone: స్టన్నింగ్ లుక్ తో 'గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్'.. మీరు కొనాలనుకుంటున్నారా?
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ నుంచి రాబోయే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 'పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్' డిజైన్ లీకైంది. గతేడాది విడుదలైన 'పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్' మోడల్‌తో పోల్చితే పెద్దగా మార్పులు కనిపించడం లేదు. పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ కూడా అదే డిజైన్‌ను కొనసాగించినట్లు సమాచారం. పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ కెమెరా సెటప్ కూడా పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ మాదిరిగానే ఉన్నట్లు తెలుస్తోంది. '48MP ప్రైమరీ బ్యాక్ కెమెరా' మరోసారి ఉండొచ్చని అంచనా. అలాగే సెన్సార్ స్పెసిఫికేషన్‌లు కూడా మారకపోవచ్చని అర్థమవుతోంది. పిక్సెల్ 9ఏ మాదిరిగా, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌లో కూడా సిమ్ కార్డ్ స్లాట్ ఫోన్ పైభాగంలో ఉంది. లెఫ్ట్ ఎడ్జ్‌లో కొత్త సిమెట్రిక్ కటౌట్‌లు కనిపిస్తున్నాయి.
Details
పెద్ద డైమెన్షన్లు, తక్కువ మందం
ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ 155.2 x 150.4 x 5.3mm డైమెన్షన్లతో వస్తోంది. గత మోడల్‌తో పోల్చితే కొంత పెద్దదైనా, తక్కువ మందంతో డిజైన్ చేశారు. హానర్ మ్యాజిక్ V3, OPPO ఫైండ్ N5 వంటి ఫోల్డబుల్ ఫోన్లతో పోలిస్తే ఇది ఇంకా స్లిమ్‌గా ఉండనుంది. పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ఫీచర్లు గూగుల్ టెన్సర్ G5 చిప్‌పై పనిచేస్తుంది. 256GB,512GB స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఆగస్టులో 'మేడ్ బై గూగుల్' ఈవెంట్‌లో పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XLతో పాటు 'పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ లాంచ్' అయ్యే అవకాశముంది. పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ధరపై ఇంకా స్పష్టత రాలేదు.