పిక్సెల్ 6a కంటే గూగుల్ పిక్సెల్ 7a ఫోన్‌లో ఎక్కువ ఫీచర్లు
గూగుల్ ప్రొడక్టుల్లో పిక్సెల్ 7a సిరీస్ నుంచి కొత్త మోడల్ ఫోన్ రానుంది. గతేడాది వచ్చిన పిక్సెల్ 6a స్థానంలో ఈ ఫోన్ ను భారత్ మార్కెట్లోకి తీసుకురానున్నాయి.ప్రస్తుతం పిక్సెల్ 7a లక్షణాలు, ఫీచర్లు గురించి తెలుసుకుందాం. Pixel 7a, పాలికార్బోనేట్ మెటీరియల్‌కు బదులుగా మెటల్‌తో తయారు చేసిన కెమెరా బార్‌తో వెనుకవైపున డిజైన్ చేశారు. ఇది టాప్-సెంటర్డ్ పంచ్-హోల్, IP67-రేటెడ్ బాడీ, అల్యూమినియం ఫ్రేమ్, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉండడం దీని ప్రత్యేకత. Pixel 7a పిక్సెల్ 6a మాదిరిగానే 6.1-అంగుళాల పూర్తి-HD+ (1080x2400 పిక్సెల్‌లు) OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ముందు దాని కంటే ఎక్కువ రిఫ్రెష్ రేట్ (90Hz v/s 60Hz)తో రానుంది.
గూగుల్ పిక్సెల్ 7a ధర, వివరాలు
Pixel 7a గూగుల్ Tensor G2 చిప్‌సెట్ ద్వారా రానుంది. LPDDR5 RAM, UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుందని చెప్పవచ్చు. 18W వైర్డ్ ఛార్జింగ్ టెక్ సపోర్టుతో హుడ్ కింద 4,410mAh బ్యాటరీ ఉండవచ్చు పిక్సెల్ 7a ధర సూమారుగా 499 డాలర్లు ఉండొచ్చు. అంటే (సూమారుగా 40,950)గా ఉండనుంది. ఈ ఏడాదిలో గూగుల్ లీక్ ప్రకారం.. కొత్త Pixel A సిరీస్ ఫోన్‌ను పాత ధరకే అందించే అవకాశం ఉండనుంది. లేకపోతే ధరను 50 డాలర్ల వరకు పెంచే అవకాశం ఉంటుంది. Pixel 6a భారత మార్కెట్లో రూ. 43,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన విషయం తెలిసిందే.