Google Chrome: 2 బిలియన్ల వినియోగదారుల కోసం అత్యవసర క్రోమ్ భద్రతా అప్డేట్ ను విడుదల చేసిన గూగుల్
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల టార్గెట్ కావొచ్చని హెచ్చరికలు వెలువడుతున్నాయి. గూగుల్ ప్రకారం, క్రోమ్ బ్రౌజర్‌లో ఉన్న ఓ కీలకమైన సెక్యూరిటీ లోపం వల్ల 2బిలియన్లకు పైగా యూజర్ల డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే వెంటనే బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయాలని కంపెనీ స్పష్టంగా సూచించింది. ఇప్పటికే గూగుల్ అత్యవసర సెక్యూరిటీ అప్‌డేట్‌ను విడుదల చేసింది. డెస్క్‌టాప్ క్రోమ్ యూజర్లు ఈ కొత్త అప్‌డేట్‌ను ఆలస్యం చేయకుండా ఇన్‌స్టాల్ చేసుకోవాలని తెలిపింది. విండోస్,macOS,లైనక్స్ వంటి ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్‌లలో తాజా ప్యాచ్ అందుబాటులో ఉంది. బ్రౌజర్ వెర్షన్‌ని చెక్ చేసి వెంటనే ఈ ప్యాచ్‌ని అప్లై చేయాలని ప్రత్యేక సూచనలు జారీ చేసింది.
వివరాలు
క్రోమ్ జీరో-డే ఫ్లా ఏంటి?
CVE-2025-13223 పేరుతో గుర్తిస్తున్న ఈ బగ్‌ను హ్యాకర్లు ఇప్పటికే దాడుల్లో ఉపయోగిస్తున్నారని గూగుల్ తెలిపింది. ఈ లోపం క్రోమ్‌లోని V8 జావాస్క్రిప్ట్ ఇంజిన్‌లో ఉంది. "టైప్ కన్ఫ్యూజన్" అనే సమస్య కారణంగా వెబ్ కంటెంట్‌ను హ్యాండిల్ చేసే సమయంలో మెమరీ ఎర్రర్‌లు ఏర్పడి, హానికర కోడ్ నడిచే పరిస్థితి వస్తుంది. దాని ప్రభావంగా బ్రౌజర్ పూర్తిగా క్రాష్ కావచ్చు. ఈ సెక్యూరిటీ సమస్య చాలా ప్రమాదకరమని గూగుల్ స్పష్టం చేసింది.
వివరాలు
ఎవరికి రిస్క్ ఎక్కువంటే?
Windows, macOS, Linux ప్లాట్‌ఫామ్‌లపై క్రోమ్ స్టేబుల్ వెర్షన్ వాడుతున్న వాళ్లందరూ వెంటనే అప్‌డేట్ చేయాలి. పైగా క్రోమియం ఆధారంగా పనిచేసే ఇతర థర్డ్ పార్టీ బ్రౌజర్‌లలో కూడా ఇదే రిస్క్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంట్లో, ఆఫీసుల్లో, విద్యా సంస్థల్లో బ్రౌజర్లు వాడుతున్న భారతీయ యూజర్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. జీరో-డే ఫ్లాపై గూగుల్ రియాక్షన్ : గూగుల్ ఈ జీరో-డే బగ్‌ను గుర్తించిన వెంటనే ప్యాచ్ చేసిన క్రోమ్ అప్‌డేట్‌లను రిలీజ్ చేసింది. విండోస్ కోసం 142.0.7444.175/.176 వెర్షన్, macOS కోసం 142.0.7444.176 వెర్షన్ విడుదల చేసింది. ఇంకా వివిధ ప్లాట్‌ఫామ్‌లకు ఫిక్స్‌లు దశలవారీగా అందిస్తోంది.
వివరాలు
ఎలా సేఫ్‌గా ఉండాలంటే? :
అయితే అవసరమైతే యూజర్లు మాన్యువల్ గా కూడా అప్‌డేట్ చెక్ చేయాలని సూచిస్తుంది. అప్‌డేట్ పూర్తిగా అమల్లోకి రావాలంటే బ్రౌజర్ రీస్టార్ట్ తప్పనిసరి అని గూగుల్ చెబుతోంది. ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి Menu → Help → About Google Chrome సెక్షన్‌లోకి వెళ్లండి. లేటెస్ట్ వెర్షన్ ఉందో లేదో చెక్ చేయండి. అప్‌డేట్ అందుబాటులో ఉంటే వెంటనే ఇన్‌స్టాల్ చేసి బ్రౌజర్ రీస్టార్ట్ చేయండి. ఆటోమేటిక్ అప్‌డేట్ సెట్టింగ్స్ ఆన్ ఉన్నా కూడా ప్యాచ్ పూర్తిగా అమలవ్వాలంటే రీస్టార్ట్ అవసరం. ఇతర క్రోమియం బ్రౌజర్ వాడుతున్నవాళ్లు కూడా కొత్త అప్‌డేట్‌ల కోసం చెక్ చేయాలి. తెలియని వెబ్‌సైట్లకు వెళ్లడం, తెలియని లింక్‌లను క్లిక్ చేయడం నివారించడం మంచిది.