LOADING...
Google: గూగుల్ తొలి అణుశక్తి ఆధారిత AI డేటా సెంటర్ టెన్నెస్సీలో
గూగుల్ తొలి అణుశక్తి ఆధారిత AI డేటా సెంటర్ టెన్నెస్సీలో

Google: గూగుల్ తొలి అణుశక్తి ఆధారిత AI డేటా సెంటర్ టెన్నెస్సీలో

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ తన తొలి అణు రియాక్టర్ సైట్‌ను ప్రకటించింది. ఇది 2024లో స్టార్ట్‌అప్ కైరోస్ పవర్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా అమలు కానుంది. హెర్మెస్ 2 ప్లాంట్ టెన్నెస్సీ రాష్ట్రంలోని ఓక్ రిడ్జ్ ప్రాంతంలో ఏర్పాటు చేయబడుతోంది. దీని ద్వారా టెన్నెస్సీ వ్యాలీ అథారిటీ (TVA) తో దీర్ఘకాలిక ఒప్పందం కింద 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఓక్ రిడ్జ్ ప్లాంట్ అనేది మొత్తం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా తీసుకున్న భారీ ప్రాజెక్ట్‌లో మొదటి అడుగుగా పరిగణిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అనేక చిన్న మాడ్యూలర్ రియాక్టర్లు (SMRs) ఉపయోగించనున్నారు.

విద్యుత్ సరఫరా 

డేటా సెంటర్లకు అణుశక్తి వినియోగం 

హెర్మెస్ 2 ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను గూగుల్ డేటా సెంటర్లకు సరఫరా చేయనున్నారు. ముఖ్యంగా టెన్నెస్సీ రాష్ట్రంలోని మాంట్‌గోమరీ కౌంటీలో,అలాగే అలబామా రాష్ట్రంలోని జాక్సన్ కౌంటీలో ఉన్న డేటా సెంటర్లు ఈ విద్యుత్‌ను ఉపయోగించనున్నాయి. ఈ సౌకర్యం 2030 నాటికి కార్యకలాపాలు ప్రారంభించనుంది."అణుశక్తి అనేది భవిష్యత్ ఇంధన భద్రతకు బలమైన పునాదిలాంటిది. గూగుల్ ఈ ప్రాజెక్ట్‌లో ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టడం, రిస్క్‌ను భరించడం వలన మా కస్టమర్లపై భారం పడకుండా టెక్నాలజీ అభివృద్ధి కొనసాగుతుంది" అని TVA సీఈఓ డాన్ మౌల్ తెలిపారు.

చారిత్రాత్మక ఒప్పందం 

తొలి కార్పొరేట్ అణుశక్తి కొనుగోలు ఒప్పందం 

గూగుల్, కైరోస్ పవర్‌ల మధ్య కుదిరిన ఈ ఒప్పందం SMRs నుండి అణుశక్తిని కొనుగోలు చేసే తొలి కార్పొరేట్ ఒప్పందంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్ట్ 2035 నాటికి 500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోనుంది. అయితే, ఈ వినూత్న ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక వివరాలను ఇంతవరకు అధికారికంగా వెల్లడించలేదు.