LOADING...
Google DeepMind: గూగుల్‌ డీప్‌మైండ్‌ నుంచి అడ్వాన్స్డ్‌ SIMA 2.. గేమ్‌ వరల్డ్‌లో నేర్చుకుంటూ పనిచేసే ఏఐ
గేమ్‌ వరల్డ్‌లో నేర్చుకుంటూ పనిచేసే ఏఐ

Google DeepMind: గూగుల్‌ డీప్‌మైండ్‌ నుంచి అడ్వాన్స్డ్‌ SIMA 2.. గేమ్‌ వరల్డ్‌లో నేర్చుకుంటూ పనిచేసే ఏఐ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2025
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్‌ డీప్‌మైండ్‌ తన కొత్త ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మోడల్‌ SIMA 2ను విడుదల చేసింది. ఇది 3D ప్రపంచాల్లో ఆలోచిస్తూ, నేర్చుకుంటూ పని చేసే అడ్వాన్స్డ్‌ ఏఐ సిస్టమ్‌గా చెప్పబడుతోంది. గూగుల్‌ జెమినీ మోడళ్ల సహాయంతో తయారైన ఈ తాజా వెర్షన్‌ ప్లానింగ్‌, కంటిన్యువస్‌ లెర్నింగ్‌ వంటి పనుల్లో ముందంజలో ఉందని సంస్థ చెబుతోంది. మార్చి 2024లో వచ్చిన మొదటి SIMA మోడల్‌పై ఆధారపడి రూపొందిన SIMA 2, 3D గేమ్‌ వరల్డ్‌లో యూజర్‌ ఇచ్చిన లక్ష్యాలను చూసి, 'షెల్ట‌ర్‌ కట్టడం', 'రెడ్‌ హౌస్‌ కనుగొనడం' వంటి టాస్క్‌లను చిన్న చిన్న దశలుగా విడదీసి, కీబోర్డ్‌, మౌస్‌ లాంటి ఇన్‌పుట్లతో పూర్తి చేస్తుంది.

వివరాలు 

మంచి పనితీరు చూపించిన SIMA 2

అలాగే స్క్రీన్‌పై కనిపించే దృశ్యాల ఆధారంగా సూచనలను అర్థం చేసుకుని చర్యలో పెట్టే సామర్థ్యం కూడా దీనిలో ఉంది. కొత్త గేమ్‌ ఎన్విరాన్‌మెంట్‌ల్లో కూడా SIMA 2 మంచి పనితీరు చూపించింది. మైన్డోజో (Minecraft రీసెర్చ్‌ వెర్షన్‌), ASKA వంటి కొత్త గేమ్‌లలో టెస్ట్‌ చేయగా, పాత వెర్షన్‌తో పోల్చితే మరింత అడాప్టివ్‌గా, ఎక్కువ టాస్క్‌లు విజయవంతంగా పూర్తి చేసినట్లు డీప్‌మైండ్‌ తెలిపింది. స్కెచ్‌లు, ఎమోజీలు, విభిన్న భాషలు.. ఈ అన్ని రూపాల్లో ఇచ్చే సూచనలను కూడా సులభంగా అర్థం చేసుకుని పనిచేయడం దీని మరో ప్రత్యేకత. SIMA 2కు మానవులు చేసిన డెమోలు, అలాగే జెమినీ మోడళ్ల ద్వారా ఆటోమేటిక్‌గా తయారైన అనోటేషన్లు కలిపి ట్రైనింగ్‌ ఇస్తారు.

వివరాలు 

తగనున్న మానవుల లేబుల్డ్‌ డేటాపై ఆధారం 

తెలియని ప్రదేశాల్లో కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నప్పుడు ఆ అనుభవాన్ని కూడా మళ్లీ దాని ట్రైనింగ్‌లో ఉపయోగిస్తారు. దీంతో మానవుల లేబుల్డ్‌ డేటాపై ఆధారపడటం తగ్గుతుంది. అయితే ఇంకా దీర్ఘకాలిక మెమరీ, క్లిష్టమైన మల్టీ-స్టెప్‌ రీజనింగ్‌, అతి సూక్ష్మ కంట్రోల్‌లో SIMA 2కు కొంత కష్టమేనని డీప్‌మైండ్‌ అంగీకరిస్తోంది. ఇవన్నీ ఉన్నా, భవిష్యత్‌ ఏఐ అభివృద్ధికి SIMA 2 పెద్ద అవకాశాలు తెరుస్తుందని సంస్థ భావిస్తోంది. 3D గేమ్‌ ప్రపంచాలు రేపటి రోబోట్లను ట్రెయిన్‌ చేయడానికి సరైన ప్లాట్‌ఫారంగా ఉపయోగపడతాయని, నేచురల్‌ లాంగ్వేజ్‌ అర్థం చేసుకుని ప్లాన్‌ చేసి పనిచేసే జనరల్‌ పర్పస్‌ రోబోట్ల దారిని ఈ మోడల్‌ సులభం చేస్తుందనే ఆశాభావం గూగుల్‌ వ్యక్తం చేసింది.