Google's U-turn: ఆయుధాల కోసం AIని నిర్మించకూడదని ఆంక్షలను సడలించుకొంది
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ పాలసీ పరంగా గూగుల్ ఒక కీలక నిర్ణయం తీసుకొంది.
ఇప్పటి వరకూ నైతిక నిబంధనల ప్రకారం, ఆయుధాలు, నిఘా, కృత్రిమ మేధం ఉపయోగించే ఇతర అంశాలలో గూగుల్ దూరంగా ఉండేది.
కానీ, తాజాగా ఈ ఎథికల్ గైడ్‌లైన్స్‌ను మార్చి, సంస్థ వాటి నుంచి వైదొలగింది.
ఈ విషయాన్ని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ మానియికా, డెమిస్ హస్సాబిస్ తమ బ్లాగ్ పోస్టులో ప్రకటించారు.
వివరాలు
మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షణ
''ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన భౌగోళిక రాజకీయాల మధ్య, ఏఐలో ఆధిపత్యం సాధించేందుకు పోటీ సాగుతోంది. ఈ సమయంలో, స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కుల గౌరవం వంటి అంశాల ఆధారంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కృత్రిమ మేధ రంగంలో నాయకత్వం వహించాలి'' అని జేమ్స్ మానియికా, డెమిస్ హస్సాబిస్ వెల్లడించారు.
కొత్త మార్పులతో, అంతర్జాతీయ చట్టాలు,మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షణ ఉంటుందని వారు చెప్పారు.
వివరాలు
నాలుగు ప్రధాన రంగాల్లో ఆంక్షలు
2018లో, గూగుల్ కృత్రిమ మేధం ఉపయోగంపై నాలుగు ప్రధాన రంగాల్లో ఆంక్షలు విధించింది.
వీటిలో ఆయుధాలు, నిఘా, భద్రతా సంబంధిత నష్టాలు కలిగించే టెక్నాలజీలు, అంతర్జాతీయ చట్టాలు,మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి నిర్ణయం తీసుకుంది.
అప్పట్లో, గూగుల్ మొదట పెంటగాన్‌తో కలిసి ప్రాజెక్ట్ మావెన్‌లో భాగమైంది, ఇందులో డ్రోన్‌ల నుండి సేకరించిన చిత్రాలను గూగుల్ ఏఐ ద్వారా విశ్లేషించాల్సి వుంది.
అయితే, చాలా మంది ఉద్యోగులు దీనిని వ్యతిరేకించడంతో, గూగుల్ ఆ ప్రాజెక్టు నుండి వైదొలిగింది మరియు ఆ తర్వాత కాంట్రాక్టును పునరుద్ధరించలేదు.
వివరాలు
గూగుల్ తన స్వంత ఆంక్షలను సడలించింది
2022లో చాట్‌జీపీటీ మార్కెట్లోకి రావడంతో, కృత్రిమ మేధం టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందింది.
అయితే, రెగ్యులేషన్స్ ఆ వేగాన్ని అందుకోవడంలో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంతో, గూగుల్ కూడా తన స్వంత ఆంక్షలను కొంతమేర సడలించింది.