LOADING...
Google New Feature: గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మరో కొత్త ఫీచర్ … 'ప్రిఫర్డ్‌ సోర్సెస్‌'
గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మరో కొత్త ఫీచర్ … 'ప్రిఫర్డ్‌ సోర్సెస్‌'

Google New Feature: గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మరో కొత్త ఫీచర్ … 'ప్రిఫర్డ్‌ సోర్సెస్‌'

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్‌ తన సెర్చ్‌ ఇంజిన్‌లో కొత్త ఫీచర్‌ 'Preferred Sources'ను ప్రారంభించింది. దీని ద్వారా యూజర్లు తమకు నచ్చిన వార్తా వెబ్‌సైట్లు, బ్లాగులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఎంపిక చేసిన వెబ్‌సైట్ల కంటెంట్‌ గూగుల్‌ సెర్చ్‌లోని టాప్ స్టోరీస్ విభాగంలో ప్రాధాన్యంగా కనిపిస్తుంది. యూజర్ల అభిరుచుల ఆధారంగా మరింత సంబంధిత కంటెంట్‌ అందించడమే దీని లక్ష్యం.

యూజర్ గైడ్ 

ఎలా యాడ్‌ చేసుకోవాలి? 

ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించాలంటే ముందు ట్రెండింగ్‌ టాపిక్‌పై సెర్చ్‌ చేయాలి. గూగుల్‌ సెర్చ్‌ ఫలితాల్లోని Top Stories విభాగం పక్కన ఒక స్టార్‌ (★) ఐకాన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి, సెర్చ్‌ ద్వారా మీకు నచ్చిన వెబ్‌సైట్లను ఎంపిక చేసుకోవచ్చు. ఒకసారి యాడ్‌ చేసిన తర్వాత పేజీని రిఫ్రెష్‌ చేస్తే, ఎంపిక చేసిన సోర్సెస్‌ నుంచి మరిన్ని కథనాలు Top Storiesలో కనిపిస్తాయి.

కంటెంట్ వైవిధ్యం 

'From your sources' విభాగం 

ప్రిఫర్డ్‌ సోర్సెస్‌తో పాటు, గూగుల్‌ సెర్చ్‌లో From your sources అనే ప్రత్యేక విభాగం కూడా చూపిస్తుంది. ఇది యూజర్‌ ఎంపిక చేసిన వెబ్‌సైట్ల కంటెంట్‌ను హైలైట్‌ చేయడానికి ఉద్దేశించబడింది. దీని ద్వారా వారు నమ్మకమైన సోర్సెస్‌ నుంచి ఎక్కువ వార్తలను చూడగలుగుతారు. గూగుల్‌ ఈ ఫీచర్‌ను ముందుగా Search Labsలో ట్రయల్‌గా పరీక్షించింది. అందులో సగానికి పైగా యూజర్లు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సోర్సెస్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది.

వ్యక్తిగతీకరణ 

గూగుల్‌ సెర్చ్‌లో కీలక మార్పు 

'Preferred Sources' ప్రారంభం గూగుల్‌ సెర్చ్‌ అనుభవంలో ఒక పెద్ద మార్పుగా భావిస్తున్నారు. ఇప్పటివరకు పూర్తిగా ఆల్గోరిథమ్‌పై ఆధారపడిన గూగుల్‌, ఇప్పుడు యూజర్లకే తమ సెర్చ్‌ ఫలితాలను కస్టమైజ్‌ చేసుకునే అవకాశం ఇస్తోంది. దీని ద్వారా వారు ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన సోర్సెస్‌ నుంచి వచ్చే వార్తలను వెంటనే పొందగలుగుతారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ భారతదేశం, అమెరికాలో ఇంగ్లీష్‌ సెర్చ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.