Google: పాత పిక్సెల్ వాచీల కోసం Wear OS 5 అప్‌డేట్‌ను నిలిపివేసిన గూగుల్
గూగుల్ తన పాత పిక్సెల్ వాచీలకు Wear OS 5 అప్‌డేట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు Pixel Watch 1, Pixel Watch 2 పరికరాల్లో ఖాళీ స్క్రీన్ సమస్యను ఎదుర్కొవడవతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. Droid Life మొదట ఈ విషయాన్ని నివేదించింది. గూగుల్ ఈ సమస్యను పరిష్కరించేందుకు చురుగ్గా పని చేస్తోందని, కొత్త ఫీచర్‌ను మళ్లీ ఈ ఏడాది చివర్లో విడుదల చేస్తామన్నారు. నవీకరణ వల్ల పిక్సెల్ వాచీలు స్తంభించిన వారికి Google తన సపోర్ట్ సైట్‌లో పలు ట్రబుల్షూటింగ్ మార్గదర్శకాలను అందించింది.
పిక్సెల్ వాచీలకు కొత్త ఫీచర్
సాధారణ సెట్టింగ్‌లను యాక్సెస్ చేయలేని వారు, పరికరాన్ని ఫాస్ట్ బూస్ట్ ద్వారా ఫ్యాక్టరీ రీసెట్ చేయవచ్చని సూచించింది. ఈ మార్గదర్శకాల ద్వారా వినియోగదారులు తమ పరికరాలకు తిరిగి కార్యకలాపాలు పునరుద్ధరించుకోవచ్చు, ఇదిలా ఉంటే, గూగుల్ పిక్సెల్ వాచీల కోసం మరో కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. వాచ్ పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు వినియోగదారుల ఫోన్‌కు నోటిఫికేషన్‌ను పంపే ఈ ఫీచర్ Wear OS 5 అప్‌డేట్ లేకుండా కూడా పని చేస్తుంది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్న వినియోగదారులకు ఈ ఫీచర్ కొంత సౌలభ్యాన్ని ఇస్తుంది.