Google TV G32 Remote: గూగుల్ టీవీ సోలార్ రిమోట్.. ఇక బ్యాటరీ మార్చాల్సిన అవసరమే లేదు!
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్ కోసం ఛార్జింగ్ అవసరం లేకుండా, బ్యాటరీ మార్చాల్సిన పనిలేకుండా పనిచేసే కొత్త రిమోట్‌ను గూగుల్ పరిచయం చేసింది. G32 రిమోట్‌గా పేరుగాంచిన ఈ డివైస్‌ను 'ఓహ్సంగ్ ఎలక్ట్రానిక్స్' అభివృద్ధి చేసింది. ఇది ఇండోర్ సోలార్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ రిమోట్ ప్రత్యేకత ఏమిటంటే—దీనిలో ముందు, వెనుక రెండింటిలోనూ 'సౌర ప్యానెల్స్' అమర్చబడ్డాయి. ఇవి ఇంట్లోని LEDలైట్లు, CFLబల్బులు, టీవీ స్క్రీన్ బ్రైట్‌నెస్, పగటి వెలుతురు వంటి ఏ కాంతినైనా విద్యుత్తుగా మారుస్తాయి. అంటే రిమోట్ సోఫా మీద ఉన్నా, టేబుల్‌పై ఉన్నా, ఇంట్లో లైట్లు ఆన్‌లో ఉన్నంత వరకు నిరంతరం ఛార్జ్ అవుతూనే ఉంటుంది. అంతేకాదు, ఇది స్వయంగా రీఛార్జ్ అవే రిఛార్జబుల్ బ్యాటరీని కలిగి ఉంటుంది.
Details
బ్యాటరీల అవసరం పూర్తిగా తగ్గనుంది
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ డిస్పోజబుల్ బ్యాటరీలు కుప్పలు కూలుతున్నాయి, దీంతో భారీ స్థాయిలో ఇ-వేస్ట్ పెరుగుతోంది. ఈ స్మార్ట్ సోలార్ రిమోట్ ద్వారా AA, AAA బ్యాటరీల అవసరం పూర్తిగా తగ్గిపోవడంతో ఈ సమస్యను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. ఎపిషైన్ పేర్కొన్నదేమిటంటే భవిష్యత్తులో స్మార్ట్ థర్మోస్టాట్లు, కీబోర్డులు, హోమ్ రిమోట్‌లు, IoT డివైసులు వంటి అనేక పరికరాలు కూడా ఇదే టెక్నాలజీ మీద నడుస్తాయి. ప్రస్తుతం ఈ G32 రిమోట్ ఏ Chromecast లేదా Google TV పరికరాలతో అధికారికంగా అందుబాటులో లేదు. ఇది కేవలం ఒక రిఫరెన్స్ మోడల్ మాత్రమే.
Details
రాబోయే నెలలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం
టీవీ తయారీదారులు కోరుకుంటే ఈ రిమోట్‌ను తమ కొత్త Google TV మోడళ్లలో చేర్చుకోవచ్చు. ఇది రాబోయే నెలల్లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశమున్నా, లాంచ్ తేదీ మరియు ధరను ఇంకా ప్రకటించలేదు. సౌరశక్తితో పనిచేసే ఈ స్మార్ట్ రిమోట్, ఇప్పుడు టెక్నాలజీ సౌలభ్యం + పర్యావరణ రక్షణ దిశగా ఎలా అభివృద్ధి చెందుతోంది అనే విషయానికి మంచి ఉదాహరణ. ఇక భవిష్యత్తులో మీ టీవీ రిమోట్ ఎప్పటికీ డెడ్ అయ్యే ప్రమాదమే లేదు. ఎందుకంటే అది స్వయంగా ఛార్జ్ అవుతూనే ఉంటుంది!