Page Loader
Sundar Pichai: భారతదేశంలో గూగుల్ AI అప్లికేషన్లను విస్తరిస్తుంది: CEO సుందర్ పిచాయ్
భారతదేశంలో గూగుల్ AI అప్లికేషన్లను విస్తరిస్తుంది: CEO సుందర్ పిచాయ్

Sundar Pichai: భారతదేశంలో గూగుల్ AI అప్లికేషన్లను విస్తరిస్తుంది: CEO సుందర్ పిచాయ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2024
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

79వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) సమావేశం న్యూయార్క్‌లో జరిగింది.ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు పాల్గొన్నారు. 'యూఎన్‌ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్' కార్యక్రమంలో భాగంగా, ఆల్ఫాబెట్‌ ఇంక్‌, గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ 'గ్లోబల్ ఏఐ ఆపర్చునిటీ ఫండ్' ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఫండ్‌లో గూగుల్‌ 120 మిలియన్ డాలర్లు (రూ. వెయ్యి కోట్లు) సమకూరుస్తోంది. ఈ నిధులను ప్రపంచంలోని వివిధ కమ్యూనిటీలలో ఏఐ ఎడ్యుకేషన్‌, శిక్షణ కోసం ఖర్చు చేస్తామని చెప్పారు. లాభాపేక్షలేని సంస్థలు,ఎన్‌జీఓలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని చెప్పారు. ఈ ఏఐ ఎడ్యుకేషన్‌ను స్థానిక భాషల్లో అందించే కట్టుబాటు ఉంది.

వివరాలు 

గూగుల్‌ సేవలందించే భాషల సంఖ్య 246

ఈ సందర్బంగా సుందర్ మాట్లాడుతూ, "ప్రపంచవ్యాప్తంగా 15 గూగుల్ ఉత్పత్తులు 50 కోట్ల వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. వాటిలో గూగుల్ సెర్చ్‌ ఇంజిన్, మ్యాప్స్, డ్రైవ్ ముఖ్యమైనవి.కంపెనీ రెండు దశాబ్దాలుగా ఏఐ సెర్చ్‌,టెక్నాలజీ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెడుతోంది. గత ఏడాదిలో, 50 కోట్ల మందికి అందుబాటులో ఉండే 110 కొత్త భాషల్లో గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను విస్తరించామని తెలిపారు. ప్రస్తుతం గూగుల్‌ సేవలందించే భాషల సంఖ్య 246కు చేరింది.

వివరాలు 

ఏఐ ప్రపంచ జీడీపీని 7 శాతం పెరిగేలా చేయడంలో సహాయపడుతుంది

ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 1,000 భాషల్లో గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ను అందుబాటులోకి తీసుకురావడంపై కృషి చేస్తున్నాము.ఏఐ ప్రపంచ శ్రామిక ఉత్పాదకతను 1.4 శాతం పాయింట్లకు పెంచుతుంది. రాబోయే దశాబ్దంలో, ఏఐ ప్రపంచ జీడీపీని 7 శాతం పెరిగేలా చేయడంలో సహాయపడుతుంది. కనెక్టివిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాఫిక్ రద్దీ వంటి పెద్ద సవాళ్లను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో ఏఐ ముఖ్యమైన భూమిక పోషిస్తుంది" అన్నారు.