Grok AI content: 'గ్రోక్' అసభ్య కంటెంట్ వ్యవహారం.. X ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని కేంద్రం… కారణమేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
Grok AI ద్వారా అశ్లీల కంటెంట్ ఉత్పత్తి అవుతున్న వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం X (మునుపటి ట్విటర్) నుంచి మరింత స్పష్టమైన సమాచారం కోరింది. Grok AIకు సంబంధించిన అశ్లీల కంటెంట్‌పై ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నారు? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడతారు? అనే అంశాలపై వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం అడిగిందని బుధవారం వర్గాలు వెల్లడించాయి. అయితే X ఇచ్చిన సమాధానం వివరంగా ఉన్నప్పటికీ, కీలక వివరాలు లేకపోవడంతో అది పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా లేదని అధికారులు తెలిపారు.
వివరాలు
కీలక వివరాలు అందులో లేవు: ప్రభుత్వం
వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, భారత చట్టాలు, మార్గదర్శకాలను తాము గౌరవిస్తున్నామని X తన సమాధానంలో పేర్కొంది. తప్పుదారి పట్టించే పోస్టులు,అనుమతి లేకుండా పెట్టే లైంగిక చిత్రాలపై కఠినమైన కంటెంట్ తొలగింపు విధానాలు అమలు చేస్తున్నామని తెలిపింది. అయినప్పటికీ, Grok AI సమస్యపై తీసుకున్న ప్రత్యేక చర్యలు, తొలగించిన కంటెంట్ సంఖ్యలు వంటి కీలక వివరాలు అందులో లేవని వర్గాలు పేర్కొన్నాయి. X సమర్పించిన వివరణ తప్పించుకునేలా లేదని, అలాగే కేవలం పైపైగా ఇచ్చిన సమాధానం కూడా కాదని అధికారులు స్పష్టం చేశారు. కానీ స్పష్టమైన గణాంకాలు, భవిష్యత్తు నివారణ చర్యలపై ఖచ్చితమైన ప్రణాళిక లేకపోవడంతో అది అసంపూర్తిగా ఉందని భావించారు.
వివరాలు
పబ్లిక్ స్టేట్‌మెంట్ ఇవ్వని X
దీంతో ఐటీ మంత్రిత్వ శాఖ Xను మరిన్ని వివరాలు సమర్పించాలని కోరింది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ఇకపై తీసుకునే చర్యలపై స్పష్టమైన డేటా ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా, భారత ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై X తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఎలాంటి పబ్లిక్ స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. Grok వంటి ఏఐ టూల్స్‌ను దుర్వినియోగం చేసి అసభ్య, లైంగిక కంటెంట్ సృష్టిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో, Xకు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగించి 'యాక్షన్ టేకెన్ రిపోర్ట్' (ATR) ఇవ్వాలని కేంద్రం సూచించింది.
వివరాలు
పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన కంటెంట్ సహా అక్రమ కంటెంట్‌పై కఠిన చర్యలు
సేఫ్ హార్బర్ అంశంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఐటీ యాక్ట్ సెక్షన్ 79 కింద ఉన్న షరతులతో కూడిన రక్షణ మధ్యవర్తులైన X లాంటి ప్లాట్‌ఫాంలకు మాత్రమే వర్తిస్తుందని, Grok వంటి టూల్స్‌కు కాదని వర్గాలు తెలిపాయి. నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోకపోతే లేదా కోర్టులో కేసు దాఖలైనప్పుడు తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఈ రక్షణ కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదివరకే, ఆదివారం రోజున X 'సేఫ్టీ' హ్యాండిల్ ద్వారా ఒక ప్రకటన విడుదలైంది. పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన కంటెంట్ సహా అక్రమ కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అలాంటి పోస్టులను తొలగించడం, ఖాతాలను శాశ్వతంగా సస్పెండ్ చేయడం, అవసరమైతే స్థానిక అధికారులతో సహకరించడం జరుగుతోందని తెలిపింది.
వివరాలు
72 గంటల్లోగా పూర్తి వివరాలతో కూడిన ATR
Grokను ఉపయోగించి లేదా ప్రాంప్ట్ చేసి అక్రమ కంటెంట్ సృష్టించినా, నేరుగా అక్రమ కంటెంట్ అప్‌లోడ్ చేసినట్టే చర్యలు ఉంటాయని X స్పష్టం చేసింది. జనవరి 2న ఐటీ మంత్రిత్వ శాఖ Xను హెచ్చరిస్తూ, Grok ద్వారా ఉత్పత్తి అవుతున్న అశ్లీల, అసభ్య, చట్టవిరుద్ధ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. 72 గంటల్లోగా పూర్తి వివరాలతో కూడిన ATR సమర్పించాలని, Grok అప్లికేషన్‌కు సంబంధించిన సాంకేతిక, సంస్థాగత చర్యలు, చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ పర్యవేక్షణ, తప్పు చేసిన యూజర్లు, అకౌంట్లపై తీసుకున్న చర్యలు, భారత చట్టాల ప్రకారం తప్పనిసరి రిపోర్టింగ్ వ్యవస్థ అమలు ఎలా జరుగుతోందన్న వివరాలు ఇవ్వాలని కేంద్రం ఆదేశాల్లో స్పష్టం చేసింది.