Loading...
GTA 6 Hacker Arion Kurtaj: జిటిఏ 6 లీక్‌ చేసిన హ్యాకర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష.. అదే రోజు విడుదల
జిటిఏ 6 లీక్‌ చేసిన హ్యాకర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష.. అదే రోజు విడుదల

GTA 6 Hacker Arion Kurtaj: జిటిఏ 6 లీక్‌ చేసిన హ్యాకర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష.. అదే రోజు విడుదల

వ్రాసిన వారు Balachander Sharma
Nov 24, 2026
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

జిటిఏ 6 గేమ్‌ ప్రపంచవ్యాప్త విడుదలైన నాలుగు రోజులకే.. దాని రహస్య సమాచారాన్ని లీక్‌ చేసిన హ్యాకర్‌ అరిఓన్ కుర్తాజ్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. 21 ఏళ్ల కుర్తాజ్‌కు లండన్‌లోని వూల్‌విచ్ క్రౌన్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, తీర్పు వెలువడిన రోజే అతను లైసెన్స్‌పై విడుదలయ్యాడు. దీనికి కారణం ఇప్పటికే జైలులో, ఆసుపత్రి పర్యవేక్షణలో గడిపిన కాలాన్ని శిక్షలో పరిగణనలోకి తీసుకోవడమే. మొదట తొమ్మిదేళ్ల శిక్ష ఎదుర్కొన్న అతనికి న్యాయమూర్తి మార్క్ టర్నర్ రెండేళ్లు తగ్గించారు.

Details

ఫైర్ టీవీ స్టిక్‌తో గేమింగ్ కంపెనీకి షాక్!

2022 సెప్టెంబర్‌లో రాక్‌స్టార్‌ గేమ్స్‌ సర్వర్లలోకి కుర్తాజ్‌ చొరబడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.

అప్పటికి అతని కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయినా హోటల్‌ గదిలోని వైఫై, మొబైల్‌ ఫోన్‌, బ్లూటూత్‌ కీబోర్డ్‌, మౌస్‌, టీవీకి అనుసంధానించిన అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌తో సంస్థ వ్యవస్థల్లోకి ప్రవేశించాడు.

దాదాపు 90 గేమ్‌ప్లే వీడియోలను దొంగిలించి, అంతర్గత స్లాక్‌ ఛానల్‌ను కూడా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. 24 గంటల్లో తనను సంప్రదించకపోతే గేమ్‌ సోర్స్‌ కోడ్‌ను బయటపెడతానని బెదిరించాడు.

Details

ఒక్క GTA 6 మాత్రమే కాదు.. భారీ సైబర్‌ దాడులు

కుర్తాజ్‌ దాడులు రాక్‌స్టార్‌కే పరిమితం కాలేదు. 2021-2022 మధ్య Lapsus$ గ్రూప్‌తో కలిసి BT, EE, Revolut, Uber సంస్థల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాడు.

ఉద్యోగులను మోసగించి అంతర్గత యాక్సెస్‌ వివరాలు పొందడం వీరి ప్రధాన పద్ధతి. ఈ దాడుల వల్ల సుమారు 13 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.

ఉబర్‌ ఒక్కటే 2.8 మిలియన్‌ డాలర్లకు పైగా నష్టపోయింది. క్రిప్టో పెట్టుబడిదారుల నుంచి కనీసం 3 లక్షల డాలర్లు కూడా దొంగిలించినట్లు ఆరోపణలున్నాయి.

ADVERTISEMENT

Details

ఇక ఇంటర్నెట్‌ వినియోగంపైనా కఠిన ఆంక్షలు

తీవ్రమైన ఆటిజం కారణంగా 2023లో కుర్తాజ్‌ విచారణకు అనర్హుడని వైద్యులు నిర్ధారించడంతో అతడిని ఆసుపత్రి పర్యవేక్షణలో ఉంచారు.

2025లో తిరిగి పరీక్షించిన తర్వాత విచారణకు అర్హుడిగా గుర్తించి, 2026 జనవరిలో సాధారణ జైలుకు తరలించారు. జైలులో అక్రమంగా ఫోన్‌ వాడుతూ పట్టుబడిన ఘటన కూడా ఉంది.

నవంబర్‌ 16న ఆరు అభియోగాలను అంగీకరించాడు. ప్రస్తుతం ఐదేళ్లపాటు అమల్లో ఉండే సీరియస్‌ క్రైమ్‌ ప్రివెన్షన్‌ ఆర్డర్‌ కింద అతని ఇంటర్నెట్‌ వినియోగంపై ఆంక్షలు విధించారు. టెలిగ్రామ్‌, డిస్కార్డ్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు.

ADVERTISEMENT