GTA 6 Holiday: GTA 6 ఫీవర్.. గేమ్ ఆడేందుకు ఉద్యోగులకు సెలవు ఇస్తున్న భారత కంపెనీలు!
ఈ వార్తాకథనం ఏంటి
13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జిటిఏ 6 గేమ్ విడుదలకు సమయం దగ్గరపడటంతో గేమింగ్ ప్రపంచంలో సందడి మొదలైంది. నవంబర్ 19న గ్రాండ్ తెఫ్ట్ ఆటో VI విడుదల కానుండగా.. ఈ క్రేజ్ ఇప్పుడు ఆఫీసుల వరకు చేరింది. ఉద్యోగులు గేమ్ ఆడేందుకు కొన్ని కంపెనీలు ఏకంగా సెలవులు ప్రకటిస్తున్నాయి. భారత్‌లో ఇంటీరియర్ డిజైన్ సంస్థ Inde by ChairsCarte నవంబర్ 19న సంస్థవ్యాప్తంగా సెలవు ప్రకటించింది. ఈ సెలవు ఉద్యోగులతో పాటు ఇంటర్న్స్, ఫ్రీలాన్సర్లకు కూడా వర్తిస్తుంది. GTA 6 కోసం ఇంతకుముందెన్నడూ చూడని స్థాయిలో ఆసక్తి కనిపిస్తోంది.
Details
50 మంది ఉద్యోగులకు Influish పెయిడ్ లీవ్
మరో భారతీయ సంస్థ Influish కూడా తన 50 మంది ఉద్యోగులకు నవంబర్ 19న పెయిడ్ లీవ్ ప్రకటించింది.
అంతేకాదు, ప్లేస్టేషన్ 5 లేని ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన గేమింగ్ సెటప్‌లో GTA 6 ఆడుకోవచ్చని చెప్పింది.
ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ boAt కూడా ఉద్యోగులకు ఆ రోజు ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. 'Out of office. Into Vice City' అంటూ చేసిన ప్రకటన గేమింగ్ అభిమానులను ఆకట్టుకుంది.
ఉద్యోగుల వినోదాన్ని కంపెనీలు ఇలా ప్రోత్సహించడం ఇప్పుడు టెక్, గేమింగ్ రంగాల్లో ఆసక్తికర ట్రెండ్‌గా మారింది.
Details
ప్రపంచ కంపెనీల్లోనూ GTA 6 సందడి
ఈ గేమింగ్ హాలిడే ట్రెండ్ భారత్‌కే పరిమితం కాలేదు. కంప్యూటర్ పెరిఫెరల్స్ సంస్థ Logitech ప్రపంచవ్యాప్తంగా సుమారు 7,000 మంది ఉద్యోగులకు 'Logi Game Day' పేరుతో పెయిడ్ లీవ్ ఇచ్చింది.
జపాన్‌కు చెందిన Pocketpair నవంబర్ 19 నుంచి 23 వరకు ఐదు రోజుల విరామాన్ని ప్రకటించింది.
Palworld గేమ్‌కు పేరున్న ఈ సంస్థ దీన్ని సరదాగా 'వైస్ సిటీలో అత్యవసర బిజినెస్ ట్రిప్'గా పేర్కొంది.
GTA 6 కోసం సంస్థలు ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గేమ్‌పై ఉన్న అంచనాలకు అద్దం పడుతోంది.
Details
ఉద్యోగుల లీవ్ రిక్వెస్టులతో కంపెనీలు షట్‌డౌన్
అమెరికాలో Burger Motorsports నవంబర్ 19న కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది.
GTA 6 విడుదల సందర్భంగా ఉద్యోగుల నుంచి అనూహ్యంగా భారీ సంఖ్యలో సెలవు దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కెనడాకు చెందిన ట్రక్ తయారీ సంస్థ Edison Motors కూడా గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు కార్యకలాపాలు నిలిపివేయనుంది.
2013లో GTA 5 విడుదలైన తర్వాత దాదాపు 13 ఏళ్లకు GTA 6 వస్తుండటంతో ఈ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది.
అమెరికా ఆర్మీకి చెందిన 3rd Infantry Division కూడా ప్రత్యేక పాస్‌ను ప్రకటించడం ఈ గేమ్ ప్రభావం ఎంతవరకు వెళ్లిందో చూపిస్తోంది.