Apple: నేడు ఆపిల్ WWDC 2024 ప్రారంభం.. కొత్త ప్రకటనలను చేసే అవకాశం
టెక్ దిగ్గజం ఆపిల్ తన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2024ని నేడు (జూన్ 10) నిర్వహించనుంది. కంపెనీ ప్రకటన ప్రకారం, WWDC 2024 జూన్ 10న భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. Apple ఈ ఈవెంట్‌ను WWDC ఈవెంట్ పేజీ, దాని అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. WWDCలో, Apple దాని పరికరాల కోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్డేట్లను విడుదల చేస్తుంది. కొన్ని ఇతర ప్రకటనలను చేయవచ్చు.
అనేక AI ఫీచర్ల ప్రకటన
iOS 18, iPadOS 18, macOS, watchOS WWDC 2024లో ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయి. అనేక ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు iOS 18లో అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. ఆపిల్ కొంతకాలంగా AI రంగంలో పనిచేస్తున్న OpenAI అనే కంపెనీతో సన్నిహితంగా పని చేస్తోంది. ఈరోజు జరిగే ఈవెంట్‌లో అనేక AI ఫీచర్లను ప్రకటించవచ్చు. కంపెనీ తన స్వంత పాస్‌వర్డ్ మేనేజర్ యాప్‌ను కూడా పరిచయం చేస్తుంది, ఇది వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉండవచ్చు.
ఈ AI ఫీచర్లు iOS 18లో అందుబాటులో ఉంటాయి
iOS 18తో కూడిన వాయిస్ మెమోస్ యాప్‌లో AI- పవర్డ్ ట్రాన్స్‌క్రిప్షన్ ఉండవచ్చు. దీని వలన కంటెంట్‌ను రికార్డ్ చేయడం సులభం అవుతుంది. స్మార్ట్ రీక్యాప్ ఫీచర్‌ను ఇందులో కనుగొనవచ్చు, ఇది మైక్రోసాఫ్ట్ రీకాల్ ఫీచర్‌ను అనుకరిస్తుంది. ఇది పరికరంలో ఇటీవలి కార్యకలాపాలను ట్రాక్ చేస్తుంది. ఎమోజీల కోసం కొత్త AI సాధనం కూడా ఉంటుంది. దీన్ని ఉపయోగించి వినియోగదారులు తమ ఎంపిక ప్రకారం ఐఫోన్‌లో ఏదైనా ఎమోజీని రూపొందించగలరు.
సిరి 2.0 పేరుతో లేటెస్ట్ ఫీచర్స్
సిరి 2.0 పేరుతో అధునాతన ఫీచర్స్ పరిచయం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కంపెనీ సిరి 2.0 మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో కంపెనీ కొత్త ఫీచర్స్ ఆవిష్కరించనున్నట్లు సమాచారం. యాపిల్ సిరి 2.0 కింద.. బుక్, కెమెరా, కీనోట్, మెయిల్, నోట్స్, ఫోటోస్, రిమైండర్‌లు, సఫారీ, స్టాక్స్, వాయిస్ మెమోస్, సిస్టమ్ సెట్టింగ్స్, ఫ్రీఫార్మ్ అండ్ ఫైల్స్, కాంటాక్ట్ అండ్ మాగ్నిఫైయర్ ఫీచర్లను పరిచయం చేస్తుంది. ఇవన్నీ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.