HMPV virus Symptoms: చైనాలో మరో కొత్త వైరస్ వ్యాప్తి.. హెచ్‌ఎంపీవీ లక్షణాలు, నివారణ ఇలా..!
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో మరో వైరస్ వ్యాప్తి చెందడంతో, ప్రజలు ఆసుపత్రుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కట్టడం వంటి వార్తలు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.
2001లో గుర్తించిన హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ ప్రస్తుతం చైనాలో విస్తరిస్తోంది. ఈ వైరస్ ప్రభావం ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తోంది.
ఆసియా దేశాలు కూడా ఈ వైరస్‌పై తీవ్ర దృష్టి సారించాయి. ఇప్పుడు దీని లక్షణాలు, నివారణ గురించి తెలుసుకుందాం.
వివరాలు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ లక్షణాలు ఫ్లూ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను పోలి ఉంటాయి.
దీనిలో దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలైనవి ఉండవచ్చు.
ఇది తీవ్రమైన రూపం దాలిస్తే బ్రాంకైటిస్, నిమోనియాను కూడా వచ్చే అవకాశం ఉంది. వైరస్ లక్షణాలు బయటపడటానికి మూడు నుంచి ఆరు రోజులు సమయం పడవచ్చు.
అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువ.
వివరాలు
నోరు, ముక్కు, కళ్లను తాకడం కూడా ప్రమాదం
ఈ వైరస్ వ్యాప్తి వివిధ మార్గాల్లో జరుగుతుంది. దగ్గు, తుమ్ము ద్వారా విడుదలయ్యే తుంపర్లు, వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా సంబంధం ఏర్పరచడం, కరచాలనం లేదా ఇతర ప్రాంతాలను తాకడం ద్వారా వ్యాపించవచ్చు.
అలాగే, వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాలను తాకిన తర్వాత, నోరు, ముక్కు, కళ్లను తాకడం కూడా ప్రమాదం.
వైరస్‌ను నివారించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
వివరాలు
వ్యాప్తి ఇలా..
సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులు శుభ్రం చేయాలి. శుభ్రం చేయని చేతులతో ముఖాన్ని తాకకుండా చూడాలి.
వైరస్ బారిన పడిన వారితో సన్నిహితంగా ఉండకుండా, వారికి దూరంగా ఉండాలి.
వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన తర్వాత శుభ్రం చేయడం మంచిది.
నివారణ ఇలా..
దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు నోరు, ముక్కును కవర్ చేయడం, ఆ తరువాత చేతులు శుభ్రం చేయడం అవసరం.
వైరస్ బారినపడిన వ్యక్తులు తమ వస్తువులను ఇతరులతో పంచుకోకుండా చూడాలి.
లక్షణాలు కనిపించినప్పుడు బయటకు వెళ్లకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దానివల్ల వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెప్తున్నారు.