Loading...
GTA 6: బ్లాక్‌బస్టర్ గేమ్ GTA 6 వెనుక బెంగళూరు టీమ్.. 1,600 మంది డెవలపర్ల కృషి!
బ్లాక్‌బస్టర్ గేమ్ GTA 6 వెనుక బెంగళూరు టీమ్.. 1,600 మంది డెవలపర్ల కృషి!

GTA 6: బ్లాక్‌బస్టర్ గేమ్ GTA 6 వెనుక బెంగళూరు టీమ్.. 1,600 మంది డెవలపర్ల కృషి!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 (GTA 6) విడుదలైంది. నవంబర్ 19, 2026న ఈ గేమ్‌ను రాక్‌స్టార్ గేమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ భారీ గేమ్ రూపకల్పనలో భారతదేశానికి కూడా కీలక భాగస్వామ్యం ఉంది. ముఖ్యంగా బెంగళూరులోని రాక్‌స్టార్ గేమ్స్ స్టూడియో నుంచి 1,600 మందికి పైగా డెవలపర్లు GTA 6 అభివృద్ధికి తమ వంతు సహకారం అందించారు. వైట్‌ఫీల్డ్‌లో ఉన్న ఈ స్టూడియో భారత గేమింగ్ పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.

వివరాలు 

గేమ్ రూపకల్పనలో బెంగళూరు టీమ్ పాత్ర

GTA 6లోని ఓపెన్ వరల్డ్ నిర్మాణం, గేమ్‌లో కనిపించే వివిధ వస్తువులు, ఇతర కీలక అంశాల రూపకల్పనలో బెంగళూరు డెవలపర్లు పనిచేశారు.

ఈ గేమ్‌లో లియోనిడా అనే కల్పిత రాష్ట్రాన్ని రూపొందించారు. అందులో వైస్ బీచ్ అనే ప్రాంతం కూడా ఉంది.

ఈ నేపథ్యంలో బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య.. GTA 6లో నగరానికి లభించిన ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు.

భారతీయ డెవలపర్లు ప్రపంచస్థాయి గేమ్ అభివృద్ధిలో భాగస్వాములు కావడం విశేషమని చెప్పుకోవచ్చు.

వివరాలు 

ధృవ ఇంటరాక్టివ్‌తో మొదలైన ప్రస్థానం

బెంగళూరులో గేమింగ్ పరిశ్రమ ఎదుగుదలకు 1995లో ఏర్పాటైన ధృవ ఇంటరాక్టివ్ సంస్థ పునాది వేసింది.

రాజేష్ రావు ఒకే కంప్యూటర్‌తో ఈ సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత అది భారతదేశంలోనే తొలి గేమ్ డెవలప్‌మెంట్ స్టూడియోగా గుర్తింపు పొందింది.

భారత గేమింగ్ రంగంలో కీలకంగా ఎదిగిన ఈ సంస్థను 2019లో రాక్‌స్టార్ గేమ్స్ కొనుగోలు చేసింది.

దీంతో ధృవ ఇంటరాక్టివ్ ప్రస్థానం రాక్‌స్టార్ కార్యకలాపాల్లో భాగమైంది.

ADVERTISEMENT

వివరాలు 

GTA 5, రెడ్ డెడ్ రెడంప్షన్ 2లోనూ భాగస్వామ్యం

బెంగళూరు డెవలపర్లకు అంతర్జాతీయ గేమింగ్ ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం ఉంది.

గతంలో గ్రాండ్ థెఫ్ట్ ఆటో V (GTA 5), రెడ్ డెడ్ రెడంప్షన్ 2 గేమ్‌ల అభివృద్ధిలోనూ ఈ బృందం సహకరించింది.

ఇప్పుడు GTA 6 రూపకల్పనలోనూ కీలక బాధ్యతలు నిర్వహించింది. ఓపెన్ వరల్డ్ నిర్మాణంతో పాటు గేమ్‌లోని వివిధ ఆస్తుల రూపకల్పనలో పాలుపంచుకుంది.

దీంతో ప్రపంచ గేమింగ్ పరిశ్రమలో భారత డెవలపర్ల నైపుణ్యం మరోసారి చర్చనీయాంశమైంది.

ADVERTISEMENT

వివరాలు 

GTA 5, GTA 6 మధ్య కాలాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ

GTA 6 విడుదల రాజకీయ చర్చలకు కూడా వేదికగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్‌ దీనికి కారణమైంది.

GTA 5 విడుదలైనప్పటి నుంచి GTA 6 అందుబాటులోకి వచ్చే వరకు గడిచిన 13ఏళ్లలో భారత్‌లో చోటుచేసుకున్న మార్పులను ఆయన ప్రస్తావించారు.

'భారతదేశం ఒక కొత్త ఆట ఆడుతోంది' అనే క్యాప్షన్‌తో ఈ పోస్టును పంచుకున్నారు.

గత 13ఏళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధి,పేదరికం తగ్గింపు వంటి అంశాలను ఈ పోస్టులో హైలైట్ చేశారు.

అదే సమయంలో గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ పాలనను ప్రస్తుత పరిస్థితులతో పోలుస్తూ విమర్శలు చేశారు.

దీంతో GTA 6 విడుదల అంశం గేమింగ్ ప్రపంచాన్ని దాటి రాజకీయ చర్చల్లోనూ ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి గేమ్

GTA 6 భారతదేశంలో స్థానిక సమయం ప్రకారం అర్ధరాత్రి 12 గంటలకు విడుదలైంది.

వివిధ ప్రాంతాల్లో స్థానిక సమయాలను అనుసరించి గేమ్‌ను సమాంతరంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.

ప్లేస్టేషన్ 5తో పాటు ఎక్స్‌బాక్స్ సిరీస్ X, సిరీస్ S కన్సోళ్లలోనూ ఈ గేమ్ ఆడుకోవచ్చు.

దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత గ్రాండ్ థెఫ్ట్ ఆటో సిరీస్‌లో కొత్త ప్రధాన గేమ్ రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

మరోసారి వైస్ సిటీ ప్రపంచాన్ని అన్వేషించే అవకాశం ఆటగాళ్లకు లభించింది.

లియోనిడా అనే కల్పిత రాష్ట్రం నేపథ్యంలో రూపొందించిన ఈ గేమ్‌లో విస్తృతమైన ప్రపంచాన్ని, వివిధ ప్రాంతాలను అనుభవించవచ్చు.

వివరాలు 

భారత గేమింగ్ పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు

GTA 6 అభివృద్ధిలో బెంగళూరు స్టూడియో అందించిన సహకారం భారతదేశ గేమింగ్ పరిశ్రమ ఎదుగుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఒకప్పుడు పరిమిత వనరులతో ప్రారంభమైన ధృవ ఇంటరాక్టివ్ ప్రస్థానం..నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాక్‌స్టార్ గేమ్స్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అయ్యే స్థాయికి చేరుకుంది.

బెంగళూరు టీమ్ కేవలం గేమ్‌లోని వస్తువుల రూపకల్పనకే పరిమితం కాకుండా,ప్రపంచ నిర్మాణం వంటి కీలక పనుల్లోనూ పాల్గొంది.

ఈపరిణామం భారత టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను కూడా ప్రతిబింబిస్తోంది.

గేమింగ్ రంగంలో దేశీయ ప్రతిభకు అంతర్జాతీయ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయనే విషయాన్ని చాటిచెబుతోంది.

రాజకీయనాయకులు సైతం భారత డెవలపర్ల సహకారాన్నిప్రస్తావించడంతో ఈ అంశానికి మరింత గుర్తింపు లభించింది.

GTA 6విడుదల భారత గేమింగ్ సమాజానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

ADVERTISEMENT