WhatsApp: సాధారణ లోపంతో 3.5 బిలియన్ వాట్సాప్ నంబర్లు బహిర్గతం!
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్ లో ఉన్న ఒక సాధారణ సెక్యూరిటీ లోపం కారణంగా దాదాపు 3.5 బిలియన్ ఫోన్ నంబర్లు బహిర్గతమైన విషయం ఆస్ట్రియా పరిశోధకుల బృందం వెలుగులోకి తీసుకొచ్చింది. మెటాకు చెందిన ఈ మెసేజింగ్ యాప్‌లోని కాంటాక్ట్ డిస్కవరీ ఫీచర్‌ను ఉపయోగించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల యూజర్ల ఫోన్ నంబర్లు, వారి ప్రొఫైల్ ఫోటోలు,స్టేటస్ వంటి వ్యక్తిగత వివరాలు వెలుగులోకి వచ్చినట్లు వారు వెల్లడించారు. ఇది సరైన రీసెర్చ్ స్టడీ రూపంలో నియంత్రితంగా చేయకపోయి ఉంటే,"ఇది చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్ అయ్యేది"అని పరిశోధకులు తెలిపారు. వీరు సింపుల్ టెక్నిక్‌తో WhatsApp బ్రౌజర్ వెర్షన్ ద్వారా ప్రతి నంబర్‌ను చెక్ చేస్తూ, ఒక గంటలో లక్షల కొద్దీ నంబర్లు వెరిఫై చేసి సమాచారం సేకరించారు.
వివరాలు
WhatsAppలో ఈ డేటా సేకరణను అడ్డుకునే రక్షణ వ్యవస్థ కనిపించలేదు
సుమారు 57% యూజర్ల ప్రొఫైల్ ఫోటోలు, 29% యూజర్ల స్టేటస్ టెక్స్ట్ కూడా అందుబాటులోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషయంపై Meta స్పందిస్తూ,బగ్ బౌంటీ ద్వారా రిపోర్ట్ అందిన వెంటనే పరిశీలించామని,ఇవన్నీ ప్రైవసీ సెట్టింగ్స్ మార్చకుండా ఉంచిన యూజర్లకి సంబంధించిన "పబ్లిక్ సమాచారం"మాత్రమేనని తెలిపింది. అయితే,పరిశోధకులు మాత్రం WhatsAppలో ఈ డేటా సేకరణను అడ్డుకునే రక్షణ వ్యవస్థ తమకు కనిపించలేదని స్పష్టం చేశారు. అంతేకాదు,చాలా అకౌంట్లలో డూప్లికేట్ కీలు ఉండటం మరో పెద్ద ప్రమాదమని,దీనితో సందేశాలను డీక్రిప్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సేవలను ఫోన్ నంబర్ల ఆధారంగా నడపడం కూడా భవిష్యత్తులో ప్రమాదకరమని,బిలియన్ల మంది ఉన్న ప్లాట్‌ఫారమ్‌లకు ఇది సులభంగా స్క్రాపింగ్‌కు మార్గం చూపుతుందని వారు హెచ్చరించారు.