
Chatgpt ghibli art: చాట్ జీపీటీ ద్వారా గిబ్లీ స్టైల్ ఆర్ట్.. మీ ఫోటోలను స్టైలిష్ గా మార్చే సులభమైన విధానం!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ మధ్యకాలంలో చాట్‌జీపీటీలో గిబ్లీ స్టైల్ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. చాట్ జీపీటీ అనేది ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల చేత విపరీతమైన ఆదరణ పొందిన కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్.
దీనికి ఓపెన్ఏఐ రూపకల్పన చేసింది. ఇటీవల, గిబ్లీ స్టైల్ చిత్రాలను సృష్టించడానికి ఇది మరింత ప్రాచుర్యం పొందింది.
ఫోటోలను యానిమేషన్ శైలిలో మార్చుకోవాలని ఆశించే వారందరికీ ఇది ఒక అద్భుతమైన మార్గం.
మీరు కూడా మీ ఫోటోలను గిబ్లీ శైలిలో మార్చాలని అనుకుంటే, దీని కోసం పాటించాల్సిన ప్రాసెస్ ఇదే!
వివరాలు
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న గిబ్లీ స్టైల్ ఇమేజెస్!
ఇప్పుడు సోషల్ మీడియాలో గిబ్లీ స్టైల్ చిత్రాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా X (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువ మంది ఈ చిత్రాలను షేర్ చేస్తున్నారు.
అదృష్టవశాత్తూ, మీకు ప్రత్యేకంగా డిజిటల్ ఆర్టిస్ట్ అయ్యే అవసరం లేదు - చాట్ జీపీటీ ద్వారా కేవలం కొన్ని క్లిక్‌లతో మీ ఫోటోను యానిమేషన్ ఆర్ట్‌గా మార్చుకోవచ్చు.
వివరాలు
గిబ్లీ స్టైల్ ఫోటో ఎలా సృష్టించాలి?
గిబ్లీ స్టైల్ ఫోటోలు సృష్టించడం చాలా ఈజీ! ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. కేవలం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:
చాట్ జీపీటీలో లాగిన్ అవ్వండి
మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో chat.openai.com వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఇప్పటికే అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి. లేదంటే, Google లేదా ఇతర మెయిల్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేయండి. లాగిన్ అయిన తర్వాత, GPT-40 వెర్షన్‌ను ఎంచుకోండి.
వివరాలు
ఇమేజ్ అప్‌లోడ్ చేసి గిబ్లీ ఆర్ట్‌లోకి మార్చండి
"+" (ప్లస్) ఐకాన్ పై క్లిక్ చేసి, మీ ఫోటోను అప్‌లోడ్ చేయండి. AI ని ఉపయోగించి "గిబ్లీ స్టైల్ యానిమేషన్ ఆర్ట్" గా మార్చమని అడగండి. మీరు "Ghiblify this" లేదా "Turn this image into Studio Ghibli theme"అనే ఆప్షన్ ఎంచుకోవచ్చు. కొన్ని క్షణాల్లోనే AI మీ ఫోటోను అద్భుతమైన గిబ్లీ స్టైల్ చిత్రంగా మార్చి అందిస్తుంది.
కావాల్సిన మార్పులు చేయండి
మీకు తుదిచిత్రం నచ్చకపోతే, GPT-40 ద్వారా మరిన్ని మార్పులు చేయమని అడగండి. రంగులు, నేపథ్యం, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ వంటి మార్పులను సూచించవచ్చు.
వివరాలు
గిబ్లీ ఫోటోను డౌన్‌లోడ్ చేసుకోండి
మీరు సంతృప్తి చెందిన తర్వాత, డౌన్‌లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో సేవ్ చేసుకోండి.
ఈ ఫోటోను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవచ్చు లేదా సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు.
ఎక్కువ గిబ్లీ చిత్రాలను సృష్టించాలంటే?
ఉచిత వినియోగదారులు రోజుకు 3 ఫోటోలు మాత్రమే మార్చగలరు. ప్రీమియం సభ్యత్వం తీసుకుంటే ఎన్ని ఫోటోలను అయినా గిబ్లీ స్టైల్‌గా మార్చుకోవచ్చు.
మీరు అదే స్టైల్ లో మరిన్ని ఫోటోలు సృష్టించాలనుకుంటే, కొత్త ఫోటో అప్‌లోడ్ చేసి GPT-40 ని ఉపయోగించండి.
వివరాలు
చాట్ జీపీటీ కాకుండా ఇతర AI టూల్స్ కూడా!
చాట్ జీపీటీతో పాటు, మీరు ఈ ఇతర యాప్‌లను కూడా ప్రయత్నించవచ్చు:
Groc AI: ఇది యూజర్ ఫ్రెండ్లీ టూల్, ఇది మీ ఫోటోలను అందమైన యానిమేషన్ కళాఖండాలుగా మార్చగలదు.
Insmind: ప్రత్యేకంగా గిబ్లీ ఫిల్టర్స్ అందించడానికి రూపొందించబడింది. ఫోటోలు చేతితో గీసినట్లు కనిపించేలా మర్చేస్తుంది.
ImyFone & KlingAI:ఇవి కూడా AI ఆధారంగా యానిమేషన్ ఫోటోలను రూపొందించగలుగుతాయి. గిబ్లీ స్టైల్ ఆర్ట్ - మీ ఫోటోలకు మేజిక్ టచ్!
ఇప్పటికే చాలామంది తమ ఫోటోలను గిబ్లీ ఆర్ట్‌గా మార్చుకుని సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు. మీరు కూడా ప్రయత్నించండి, మీ ఫోటోలను మాయాజాలంగా మారుస్తూ కొత్త అనుభూతిని ఆస్వాదించండి!