థ్రెడ్స్ యాప్ ని ఎదుర్కోవడానికి ట్విట్టర్ తీసుకొస్తున్న కొత్త ఫీఛర్స్ ఏంటి?
ఈ వార్తాకథనం ఏంటి
మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ కు థ్రెడ్స్ యాప్ గట్టి పోటీ ఇస్తోంది. మెటా కంపెనీ నుండి లాంచ్ అయిన థ్రెడ్స్ యాప్, ట్విట్టర్ కు సవాలుగా మారింది.
2బిలియన్ యూజర్లు ఉన్న ఇన్ స్టాగ్రామ్ కు చెందిన యాప్ కావడంతో థ్రెడ్స్ విషయంలో ట్విట్టర్ కు కొంత ఆందోళనగా ఉంది.
థ్రెడ్స్ ని ఎదుర్కోవడానికి ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఏమేమి కొత్త ఫీఛర్లు తీసుకొస్తున్నారో ఇక్కడ చూద్దాం.
తన వినియోగదారులు బయటకు వెళ్ళకుండా ఉండేందుకు ట్విట్టర్ తీసుకొస్తున్న కొత్త పాలసీలు ఏమిటో తెలుసుకుందాం.
యాడ్ రెవెన్యూని క్రియేటర్స్ తో పంచుకునే అవకాశాన్ని ట్విట్టర్ మొన్ననే తీసుకొచ్చింది. దీనివల్ల ట్విట్టర్ వాడే పాపులర్ వ్యక్తులకు లాభదాయకంగా ఉండనుంది.
Details
ప్రొఫైల్ ని చూస్తే రెవెన్యూ
ట్విట్టర్ కొత్తగా తీసుకొచ్చిన రేట్ లిమిట్ పాలసీ, విమర్శల పాలైంది. ఈ విషయంలో మస్క్ మాట్లాడుతూ వెరిఫైడ్ ప్రొఫైల్స్ గలవారికి రేట్ లిమిట్ ని మరో 50శాతం పెంచుతున్నట్లు తెలియజేసారు.
ప్రస్తుతం రిప్లైలో వస్తున్న యాడ్స్ ని షేర్ చేసుకునేందుకు ట్విట్టర్ అవకాశం ఇచ్చింది. మరికొద్ది రోజుల్లో ప్రొఫైల్ చూడటంలో వచ్చే యాడ్ రెవెన్యూని కూడా షేర్ చేస్తామని ఎలాన్ మస్క్ అన్నారు.
దీనివల్ల క్రియేటర్లకు రెవెన్యూ బాగా పెరుగుతుందని తెలియజేసారు. అయితే వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఉన్నవారి ప్రొఫైల్స్ చూసినపుడే మాత్రమే రెవెన్యూ వస్తుందట.
ట్విట్టర్ కి థెడ్స్ యాప్ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ ప్రస్తుతం ట్విట్టర్ యూజర్లు స్థిరంగా ఉన్నారు. థ్రెడ్స్ లో మాత్రం అమాంతం యూజర్ల సంఖ్య తగ్గిపోతుంది.