LOADING...
Price history: అమెజాన్‌లో వినియోగదారులకు భారీ సౌలభ్యం.. యాప్‌లోనే 'ప్రైస్ హిస్టరీ' ఫీచర్ ప్రారంభం
అమెజాన్‌లో వినియోగదారులకు భారీ సౌలభ్యం.. యాప్‌లోనే 'ప్రైస్ హిస్టరీ' ఫీచర్ ప్రారంభం

Price history: అమెజాన్‌లో వినియోగదారులకు భారీ సౌలభ్యం.. యాప్‌లోనే 'ప్రైస్ హిస్టరీ' ఫీచర్ ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2025
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్‌ తన యాప్‌లో మరో ప్రయోజనకరమైన ఫీచర్‌ను జోడించింది. షాపింగ్‌ ప్రేమికులకు ఎంతగానో ఉపయోగపడే 'ప్రైస్ హిస్టరీ' ఫీచర్‌ను అధికారికంగా ప్రవేశపెట్టింది. దీని ద్వారా గత 30 నుంచి 90 రోజుల వరకు ఒక ప్రొడక్ట్‌ ధర ఎలా మారిందో అంటే ఎంత పెరిగింది లేదా ఎంత తగ్గిందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా సేల్స్‌ సమయంలో మంచి ధరకు వస్తువును కొనాలనుకునే వినియోగదారులకు ఇది ఎంతో ఉపయుక్తమని వారు చెబుతున్నారు.

Details

ధర పక్కనే ప్రైస్టరి

ఇంతకుముందు ఒక ప్రొడక్ట్‌ ధర మార్పులను చెక్‌ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్‌లు లేదా ఇతర వెబ్‌సైట్లు వినియోగించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ అవసరాన్ని పూర్తిగా తొలగిస్తూ, అమెజాన్‌ యాప్‌లోనే బిల్ట్-ఇన్ ప్రైస్ హిస్టరీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒక వస్తువును ఎంపిక చేసిన తర్వాత స్క్రోల్ చేస్తే దాని ప్రస్తుత ధర కనిపిస్తుంది. అదే ధర పక్కనే 'ప్రైస్ హిస్టరీ' ఆప్షన్‌ కనిపిస్తుంది. దాని‌పై ట్యాప్‌ చేస్తే, ఆ ప్రొడక్ట్‌ గత 30-90 రోజుల కనిష్ఠ, గరిష్ఠ ధరలు గ్రాఫ్ రూపంలో వివరంగా చూపిస్తాయి.