సూర్యుడిపై భారీ విస్పోటనాలు.. భూమికి ప్రమాదం పొంచి ఉందా?
భవిష్యతులో సూర్యుడిపై భారీగా మరిన్ని విస్పోటనాలు జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సూర్యుడు ఊహించిన దానికన్నా ముందు 'సోలార్ మాగ్జిమమ్' దశకు చేరుకుంటున్నాడని శాస్త్రవేత్లు ఓ అంచనాకు వచ్చారు. ఏప్రిల్ నెలలోనే 23 కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏర్పాడ్డాయి. దీంతో ఇవి భూమిని చేరుకొని 'భూ అయస్కాంత తుఫాను' కు కారణమయ్యాయి. సోలార్ మాగ్జిమమ్ వల్ల సూర్యుడి చర్యలు వేగం కావడంతో రానున్న కాలంలో ప్రమాదకరమైన విస్పోటనాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే శాస్త్రవేత్తలు సూర్యుడి ఉపరితలంపై 96 స్పాట్స్ ను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే సూర్యుడిపై నల్లగా ఉండే ప్రాంతాలను సన్ స్పాట్స్ గా పిలుస్తాం.
భూమిపై ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగదు
సూర్యుడు ప్రతీ 11 ఏళ్లకు ఓసారి సౌర చక్రాన్ని పూర్తి చేస్తాడు. 2019లో ప్రారంభమైన 25వ సౌరచక్రంలో ప్రస్తుతం సూర్యుడు ఉన్నాడు. దీంతో సూర్యుడి ఉపరితలంపై విపరీతమైన చర్యలుంటాయి.ఈ సమయంలో సూర్యడిపై భారీ పేలుళ్లు జరుగుతుంటాయి. ఈ పేలుళ్లతో అవేశిత కణాలను విశ్వంలోని నలువైపు ఆవేశిత కణాలు ప్రయాణిస్తాయి. ప్రతీ 11 ఏళ్లకు సూర్యుడి ధృవాలు తారుమారు కావడంతో దక్షిణ దృవం ఉత్తరంగా.. ఉత్తర ధృవం దక్షిణంగా మారుతుంది. సోలార్ మాగ్జిమమ్ భూమి పరిమాణంతో పోలిస్తే కొన్ని వందలరెట్ల పెద్దవిగా వ్యాపిస్తూ ఉంటాయి. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ద్వారా ఆవేశిత కణాలు భూమివైపునకు రావడంతో జియోమాగ్నెటిక్ తుఫాన్ల కు కారణమవుతాయి. అయితే వీటి వల్ల భూమిపై ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగదు.