
భారతదేశ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి సహకరించనున్న IIT మద్రాస్-ఇస్రో
ఈ వార్తాకథనం ఏంటి
IIT మద్రాస్, ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC) ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ (IHSP) కోసం వ్యోమగామి శిక్షణా మాడ్యూల్‌పై పని చేయడానికి సహకరించనున్నాయి. ప్రోగ్రామ్‌ను రూపొందించడానికి ఆగ్మెంటెడ్, వర్చువల్, మిక్స్‌డ్ రియాలిటీ టెక్నాలజీలను ఉపయోగించబోతుంది.
IIT మద్రాస్‌లోని ఎక్స్‌పీరియెన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ (XTIC) ద్వారా రూపొందించిన టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో HSFCకి సహాయపడుతుంది.
IIT మద్రాస్, ఇస్రో ఇటీవల IHSPలో విస్తరించిన రియాలిటీ (XR), ఇతర టెక్నాలజీలను ఉపయోగించడంపై అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేశాయి. IIT మద్రాస్‌లో ఇటీవలే స్థాపించిన XTIC, IHSP కోసం కొత్త XRటెక్నాలజీను అభివృద్ధి చేయడమే కాకుండా, కార్యక్రమంలో పాల్గొన్న ఇస్రో HSFC ఇంజనీర్లకు సంబంధిత శిక్షణను కూడా అందిస్తుంది.
ఇస్రో
IIT మద్రాస్‌లో కొత్తగా స్థాపించిన XTIC శిక్షణా కేంద్రం
IIT మద్రాస్‌లో కొత్తగా స్థాపించిన XTIC అనేది ఒక శిక్షణా కేంద్రం. ఇది స్టార్టప్‌లకు, పరిశ్రమలకు AR, VR, MR, హాప్టిక్ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశించడానికి తగిన సహాయాన్ని అందిస్తుంది. ప్రాజెక్ట్ సపోర్ట్, నాలెడ్జ్ షేరింగ్ వంటి సేవలను ఈ కేంద్రం అందిస్తుంది. ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ (IHSP) XR రంగంలో R&D శిక్షణతో సహా మిగిలిన ప్రయోజనాల కోసం XTIC ను ఉపయోగించుకుంటుంది.
XR టెక్నాలజీస్ ప్రత్యేకంగా డిజైన్ సైకిల్‌ను తగ్గించడంలో అంతరిక్ష వాతావరణాన్ని అనుకరించడంలో స్పేస్‌ఫ్లైట్ ప్రోగ్రామ్‌లోని అనేక అంశాలలో అవగాహనా కల్పించే సామర్థ్యం ఉందని XTIC ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ మణివణ్ణన్ చెప్పారు.