విపత్తులు, వాతావరణ మార్పులను ట్రాక్ చేసే నాసా-ఇస్రో NISAR మిషన్
NISAR (నాసా-ఇస్రో సింథటిక్ ఎపెర్చర్ రాడార్) మిషన్, రాడార్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా భూమిని వీక్షించి అవసరమైన వివరాలను అందిస్తుంది. SUV-పరిమాణ ఉపగ్రహం పర్యావరణ వ్యవస్థ అవాంతరాలు,భూకంపాలు వంటి సహజ ప్రమాదాలతో సహా భూపటలం అంటే భూమి అత్యంత ఉపరితల పొర గురించి మనకు మరింత అవగాహనను కూడా పెంచుతుంది. దాదాపు $1.5 బిలియన్లతో, NISAR అత్యంత ఖరీదైన ఎర్త్-ఇమేజింగ్ ఉపగ్రహం. ఇది నాసా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మధ్య భాగస్వామ్య మిషన్. ఇది శాస్త్రవేత్తలకు వాతావరణ మార్పుల ప్రభావాలపై సమాచారాన్ని అందిస్తుంది. భవిష్యత్ ప్రమాద నిర్వహణకు NISAR డేటా కీలకం. L-బ్యాండ్, S-బ్యాండ్ అనే రెండు మైక్రోవేవ్ బ్యాండ్‌విడ్త్ లతో రాడార్ డేటాను సేకరించే మొదటి ఉపగ్రహ మిషన్ NISAR.
NISAR డేటా భవిష్యత్తులో ప్రమాద నిర్వహణలో సహాయపడుతుంది
భూమి ఉపరితలంపై మారుతున్న వాతావరణంపై అవగాహనను మెరుగుపరచడంతో పాటు, NISAR డేటా భవిష్యత్తులో ప్రమాద నిర్వహణలో సహాయపడుతుంది. ఇది భూగర్భ జలాల సరఫరాను పర్యవేక్షించడంలో కూడా సహాయపడుతుంది NISAR అత్యంత అధిక-రిజల్యూషన్ చిత్రాలను రూపొందించడానికి సింథటిక్ ఎపెర్చర్ రాడార్ అనే అధునాతన సమాచార-ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఎటువంటి వాతావరణ పరిస్థితులో అయినా NISAR డేటాను సేకరించగలదు. 12 రోజుల్లో మొత్తం భూగోళాన్ని మ్యాప్ చేయగలదు. అత్యవసర పరిస్థితుల్లో ఆ డేటాను గంటల వ్యవధిలో ట్రాన్స్ఫర్ చేయగలదు. NISAR భారతదేశంలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఇస్రో అందించిన GSLV ఎక్స్‌పెండబుల్ లాంచ్ వెహికల్‌పై టేకాఫ్ అవుతుంది. టార్గెట్ లాంచ్ డేట్ జనవరి 2024కి నిర్ణయించారు.