Page Loader
ఆర్టెమిస్ 2 మిషన్ కోసం సిద్దంగా ఉన్న నాసా SLS రాకెట్
నవంబర్ 16, 2022న ఆర్టెమిస్ 1 మిషన్ ప్రారంభం అయింది

ఆర్టెమిస్ 2 మిషన్ కోసం సిద్దంగా ఉన్న నాసా SLS రాకెట్

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 03, 2023
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్ చంద్రునిపై వ్యోమగాములను తీసుకువెళ్ళే పెద్ద మిషన్ కోసం సిద్ధమవుతుంది. ఆర్టెమిస్ 1 మిషన్‌తో తన తొలి ప్రయోగాన్ని చేసిన ఈ రాకెట్ ఇప్పుడు రెండోసారి తయారుగా ఉంది. మొదటిసారి రాకెట్ పనితీరు మీద ప్రాథమిక పరిశోధనలు చేశాక, ఇప్పుడు రెండోసారి వ్యోమగాములను తీసుకువెళ్ళే మిషన్‌కు సిద్ధమవుతుంది. 25 రోజుల సుదీర్ఘ మిషన్ కోసం నవంబర్ 16, 2022న బయలుదేరిన ఆర్టెమిస్ 1, డిసెంబర్ 11న సురక్షితంగా తిరిగి భూమికి చేరుకుంది. ఈ తొలి ప్రయోగంతో, SLS విజయవంతంగా ప్రయోగించిన అత్యంత శక్తివంతమైన రాకెట్‌గా రికార్డు సృష్టించింది. ఈ రికార్డు గతంలో NASA సాటర్న్ V రాకెట్‌కు ఉంది.

నాసా

ఆర్టెమిస్ 2 మిషన్ 2024లో ప్రారంభం అవుతుంది

SLS పనితీరు, సిబ్బంది మిషన్ల కోసం తయారుగా ఉందా లేదా అని బృందం పెద్ద మొత్తంలో డేటాను విశ్లేషించింది. గ్రౌండ్ కెమెరాలు, రాకెట్‌లోని కెమెరాలు, SLSపై ఫోకస్ చేసిన ఏరియల్ కెమెరాల నుండి దాదాపు 31 టెరాబైట్‌ల ఇమేజరీ డేటా సేకరించింది. ఇంజనీర్లు SLS ప్రయోగించిన వెంటనే అనుభవించిన అధిక ఉష్ణోగ్రతలు, ధ్వనిని కూడా పర్యవేక్షించారు. SLS ఒకే RL-10 ఇంజిన్‌తో పనిచేస్తుంది, అయితే కోర్ దశలో నాలుగు RS-25 ఇంజిన్‌లు ఉంటాయి. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే, ఆర్టెమిస్ 2 2024లో దాదాపు 10 రోజుల మిషన్‌లో చంద్రుని చుట్టూ వ్యోమగాములను తీసుకువెళుతుంది. ఆర్టెమిస్ 3 2025లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇది చంద్రుని ఉపరితలంపై వ్యోమగాములను దింపుతుంది.