
మరికొద్ది రోజుల్లో మొదటి చంద్రగ్రహణం.. మనపై ప్రభావం ఉంటుందా?
ఈ వార్తాకథనం ఏంటి
2023 సంవత్సరంలో మొత్తం 4 సూర్యగ్రహణాలు రాబోతున్నాయి. అందులో రెండు సూర్యగ్రహాణాలు, 2 రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. మొదటగా మొదటి సూర్యగ్రహణం మనం చూశాం.
ఇప్పుడు 2023లో మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతోంది. మే 5న 2023 శుక్రవారం రాత్రి 8.45 గంటలకు ప్రారంభమై, అర్ధరాత్రి 1 గంటకు ముగియనుంది. దీన్ని పెనుంబ్రల్ చంద్ర గ్రహణం అని పిలుస్తాం.
ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం వైశాఖ మాసం పౌర్ణమీ రోజున జరుగతోంది. చంద్రుడు, సూర్యుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్ర గ్రహణాలు మూడు ఉన్నాయి. అందులో సంపూర్ణ, పాక్షిక, పెనుంబ్రల్ ముఖ్యమైనవి.
Details
ఈ ఏడాది ఆక్టోబర్ 28న మరో చంద్రగ్రహణం
పెనుంబ్రల్ చంద్ర గ్రహణం భూమి నీడ చంద్రునిపై పడినప్పుడు దాన్ని పెనుంబ్రల్ చంద్రగ్రహణం అంటారు. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు.
ఇది యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అంటార్కిటికా, మధ్య ఆసియా, పసిఫిక్ అట్లాంటిక్, హిందూ మహాసముద్రంలో చూడచ్చు . చంద్ర గ్రహణం సమయంలో ఆలయాల తలుపులు మూసివేయబడతాయి.
ఈ చంద్రగ్రహణం నాలుగు గంటల 20 నిమిషాల పాటు మాత్రమే కొనసాగనుంది. ఈ ఏడాది అక్టోబర్ 28న మరో చంద్రగ్రహణం కనిపించనుంది.