రేపు హైబ్రిడ్ సూర్యగ్రహణం: ఎలా చూడాలో తెలుసా!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాదిలో అరుదైన హైబ్రిడ్ సూర్యగ్రహణం రాబోతోంది. 2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న గురువారం నాడు సంభవించనుంది.
ఇది ఇతర గ్రహణాల కంటే విభిన్నమైంది. అందుకే దీన్ని హైబ్రిడ్ సూర్యగ్రహణం అని పిలుస్తారు.
సూర్యుడికి మధ్య చంద్రుడి వచ్చినప్పుడు ఆ నీడ సూర్యుడిని కప్పేస్తే గ్రహణం సంభవిస్తుంది. ఆ గ్రహణాన్ని మనం సూర్యగ్రహణం అంటాం.
దాన్ని కొద్ది భాగం కప్పిస్తే పాక్షిక గ్రహణం అని, గ్రహణం నిప్పులు చెరుగుతూ అగ్ని వలయంలా కనిపిస్తే దాన్ని హైబ్రిడ్ సూర్యగ్రహణం అని చెబుతాం.
తొలి సూర్యగ్రహణం గురువారం ఉదయం 7:04 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12:29 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఈ గ్రహణం భారత్ లో కనిపించదని శాస్త్రవేత్తలు తెలిపారు.
details
ఆన్ లైన్ లో సూర్యగ్రహణాన్ని చూసే అవకాశం
దక్షిణ పసఫిక్ మహాసముద్రంలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పిన్స్, పాపువా న్యూ గినియా వంటి దేశాల్లో మాత్రమే ఈ హైబ్రిడ్ సూర్యగ్రహణాన్ని చూడగలమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఈ అరుదైన హైబ్రిడ్ సూర్యగ్రహణాన్ని ఆన్‌లైన్‌లో కూడా చూడవచ్చు. timeanddate YouTube ఛానల్ లో దీన్ని చూసే అవకాశం ఉంటుంది.
నాసా కూడా ఆస్ట్రేలియా నుండి ఈ ఈవెంట్‌ను ప్రసారం చేయనుంది. మళ్లీ ఇటువంటి హైబ్రిడ్ సూర్యగ్రహణం 2031లో సంభవించనుంది.
ఆ తర్వాత వచ్చే శతాబ్దంలో మార్చి 23, 2164న ఇలాంటి హైబ్రిడ్ సూర్యగ్రహణాన్ని చూస్తారని నివేదికలు తెలిపాయి.