
AI: ప్రపంచంలో తొలిసారి.. అల్బేనియాలో క్యాబినెట్‌లోకి 'ఏఐ' మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
సాంకేతిక రంగంలో వేగంగా ముందుకు సాగుతున్న కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో ఐరోపా దేశం అల్బేనియా ఒక వినూత్న అడుగు వేసింది. అవినీతిని అరికట్టే ప్రయత్నంలో ఈ దేశం ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ 'డియెల్లా'ను క్యాబినెట్ మంత్రిగా నియమించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా నియామకం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విషయాన్ని అల్బేనియా ప్రధాని ఎడీ రమా శుక్రవారం ఫేస్‌బుక్ వేదికగా ప్రకటించారు. 'డియెల్లా' అంటే అల్బేనియన్ భాషలో సూర్యుడు అని అర్థం.
Details
డియెల్లా సమూల మార్పులు తీసుకొచ్చే అవకాశం
ఆ దేశ సంప్రదాయ దుస్తులు ధరించినట్టుగా రూపుదిద్దుకున్న ఈ వర్చువల్ మహిళా మంత్రి ప్రజాధనంతో అమలు చేసే ప్రాజెక్టులను పర్యవేక్షించనుంది. 'డియెల్లా ప్రజా పనుల్లో సమూల మార్పులు తీసుకువస్తుంది. ప్రభుత్వ టెండర్లను పారదర్శకంగా పర్యవేక్షించి, అవినీతికి తావు లేకుండా చేస్తుంది. ప్రజాధన కేటాయింపులు స్పష్టతతో జరిగేలా చూసుకుంటుందని ప్రధాని ఎడీ రమా వివరించారు. అయితే ఈ ఏఐ మంత్రి తీసుకునే నిర్ణయాలు ఆచరణలో ఎలా అమలు అవుతాయనేది ఇంకా స్పష్టత లేనిదే ఉంది.