LOADING...
DRDO: భారత్ మరో ఘనత.. IADWS పరీక్ష విజయవంతం (వీడియో)
భారత్ మరో ఘనత.. IADWS పరీక్ష విజయవంతం

DRDO: భారత్ మరో ఘనత.. IADWS పరీక్ష విజయవంతం (వీడియో)

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2025
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం అత్యాధునిక సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ (Integrated Air Defence Weapon System - IADWS)ను విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. దేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. రాజ్‌నాథ్‌ సింగ్‌ తన పోస్టులో వెల్లడించిన వివరాల ప్రకారం, ఆగస్టు 23వ తేదీ అర్ధరాత్రి ఒడిశా తీరం వద్ద IADWS పరీక్ష విజయవంతంగా పూర్తయింది. ఇది బహుళ-అంచెల ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌గా రూపొందించారు.

Details

గగనతల దాడులను ఎదుర్కొనే విషయంలో మరింత బలోపేతం

ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ (QRSAM), అడ్వాన్స్‌డ్‌ వెరీ షార్ట్‌ రేంజ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ (VSHORADS), అలాగే హైపవర్‌ లేజర్‌ ఆధారిత డైరెక్ట్‌ ఎనర్జీ వెపన్స్‌ (DEW) ఉన్నాయి. ఈ విజయంపై మాట్లాడుతూ రాజ్‌నాథ్‌ సింగ్‌ - "IADWS అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, సైనిక దళాలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ పరీక్షతో బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ సామర్థ్యం రుజువైంది. శత్రువుల గగనతల దాడులను ఎదుర్కొనే విషయంలో దేశ రక్షణ మరింత బలోపేతం కానుందని పేర్కొన్నారు.

Details

 ఒకేసారి మూడు అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం

ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ 'సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థ' అభివృద్ధి ప్రణాళికను ప్రకటించగా, కొద్ది రోజుల వ్యవధిలోనే IADWS పరీక్ష జరగడం విశేషంగా మారింది. ఇక దీనికి ముందు భారత్‌ మధ్యమ శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి 'అగ్ని-5'ను కూడా విజయవంతంగా ప్రయోగించింది. ఈ పరీక్షలో క్షిపణి అన్ని సాంకేతిక, కార్యనిర్వాహక ప్రమాణాలను సాధించడమే కాకుండా లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ అగ్ని-5 క్షిపణి పరిధి 5,000 కిలోమీటర్లు. ప్రత్యేకత ఏంటంటే, ఒకేసారి మూడు అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లి ప్రయోగించే సామర్థ్యం దీనికుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పరీక్ష విజయవంతం